సినీ ఇండస్ట్రీలో మోస్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ చాలా మందే ఉన్నారు. వారిలో కొందరు హీరోలు ఉండగా.. ఎక్కువగా అందాల భామలే ఉన్నారు. ఈ లేడీ బ్యాచిలర్స్‌లో ఒకప్పుడు స్టార్, సీనియర్, జూనియర్ హీరోలనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా పేరుగాంచిన కాజల్ అగర్వాల్ ముందు వరుసలో ఉంటారు. బహుశా ఈ బ్యాచిలర్ అనే పదం కొద్దిరోజులేనేమో.. ఎందుకటే ఈ బ్యూటీ ఓ బడా బిజినెస్‌మెన్‌ను చేసుకోబోతోందట. ప్రస్తుతం చందమామ బ్యూటీ పెళ్లి గురించే టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. వయసు 35కు చేరడంతో ఇక లేట్ చేయకూడదని భావించిన కాజల్ ఫ్యామిలీ త్వరలోనే పెళ్లి బాజాలు మోగించాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అంటే అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది లాస్ట్ లేదా 2020 సంక్రాంతి తర్వాత పెళ్లి చేసుకోవాలని ఈ బ్యూటీ భావిస్తోందట.
ఇప్పటికే పలుమార్లు ఇంటర్వ్యూల్లో పెళ్లి ప్రస్తావన రాగా.. తెలివిగా సమాధానం తప్పించుకుంది. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దిరోజులకే ఓ బడా బిజినెస్‌మెన్‌తో లవ్‌లో పడిందట. అయితే ఆ విషయం బయటికి పొక్కనీయకుండా ఇన్ని రోజులుగా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ వస్తోందట. పైగా.. తనకు మంచి అబ్బాయి దొరికితే కచ్చితంగా మూడు ముళ్లు వేయించుకుంటానని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. అయితే తన చెల్లి నిషాకు పెళ్లై.. తల్లి కూడా అవ్వడంతో ఇక కాజల్‌పై ఒత్తిడి పెరగడం.. మరోవైపు ఇంట్లో వాళ్లు అబ్బాయిని చూడటం మొదలుపెట్టడంతో ఇక చేసేదేమీ లేక ఇంట్లో పెళ్లి విషయం చెప్పేసిందట. ప్రియుడు బిజినెస్‌మెన్ కావడంతో లైఫ్ సాఫీగానే ఉంటుంది కదా అని ఫ్యామిలీ కూడా ఏం చెప్పలేక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. తమిళ్‌లో కమల్ హాసన్ సరసన ‘భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది. దాంతో మరికొన్ని సినిమాలకు కూడా సైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో లిమిటెడ్‌గానే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందుకే ఈ సినిమాలు అయిపోగానే పెళ్లి పీటలెక్కాలని భావిస్తోందట. అందుకే ఈ సినిమాల షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని సదరు సినిమా డైరెక్టర్స్‌ను ఆ భామ కోరిందట. మరి పెళ్లి బిజినెస్‌మెన్‌తోనే జరుగుతుందా..? లేకుంటే మరొకరు మధ్యలో వస్తారా..? అసలు ఈ పెళ్లిపై వస్తున్న పుకార్లు ఎంతవరకు నిజమో..? అసలు ఈ బ్యూటీ లవ్‌లో పడిందా..? లేదా..? అనేది తెలియాలంటే కాజల్ క్లారిటీ ఇవ్వాల్సిందే మరి.