సంక్రాంతి బరిలో మహేష్ బాబు, అల్లు అర్జున్‌లు నువ్వా నేనా అని తలపడుతున్నారు. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ కూడా సంక్రాంతికి రిలీజ్ అంటున్నాడు. మరోపక్క ఒకటో రెండో తమిళ సినిమాలు కూడా వరసలో ఉన్నాయి. అంత డిమాండ్ ఉన్న సంక్రాంతి బరిలో మీడియం బడ్జెట్ సినిమాని నిలిపితే.. మొదటికే మోసం వస్తుందని ఓ బడా నిర్మాత ఆలోచనగా చెబుతున్నారు. నాగ చైతన్య - వెంకటేష్ కాంబోలో బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘వెంకీమామ’ని సంక్రాంతి బరిలో నిలపనున్నారనే వార్తలొచ్చాయి. అయితే తాజాగా వెంకీమామ బడ్జెట్ 40 కోట్లు గనక సంక్రాంతి బరిలో నాలుగు సినిమాల మీద పోటికెళితే... 40 కోట్ల రికవరీ కష్టమని నిర్మాత సురేష్ బాబు ఆలోచిస్తున్నాడట.
అందుకే వెంకీమామని సోలో రిలీజ్ డేట్ సెట్ చెయ్యాలనుకుంటున్నారట. అయితే సంక్రాంతి దాటితే మళ్ళీ ఫిబ్రవరి కెళ్ళాలి. ఇక క్రిష్టమస్‌కి కూడా నాలుగైదు సినిమాలు పోటీలో ఉండడంతో.. వెంకీమామని డిసెంబర్ 12న గాని 13న గాని విడుదల చేస్తే బావుంటుందని చూస్తున్నారట. ఇలా సోలో రిలీజ్ చేస్తే వెంకీమామ బడ్జెట్ రికవరీ అయ్యి గట్టెక్కేస్తుందని అనుకుంటునున్నారట. వెంకటేష్ మార్కెట్, చైతు మార్కెట్‌ని బట్టి 40 కోట్లు ఎక్కువ గనక కంపల్సరీ సోలో డేట్‌కే మొగ్గు చూపుతున్నారట. మరి ఫైనల్ గా సంక్రాంతికా? డిసెంబర్ సెకండ్ వీకా? అనేది టీం స్పందిస్తేనే గాని తెలియదు.