‘యాక్షన్’ ట్రైలర్ చాలా చాలా బాగుంది.. డెఫినెట్‌గా సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది- డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్
మాస్ హీరో విశాల్ హీరోగా సుందర్ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యాక్షన్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆడెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్ పతాకంపై ‘యాక్షన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శుక్రవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘‘మా ఇస్మార్ట్ డిస్ట్రిబ్యూటర్, ఇస్మార్ట్ శ్రీను శ్రీకార్తికేయ సినిమాస్ బేనర్‌పై ‘యాక్షన్’ సినిమాతో ఫస్ట్‌టైమ్ ప్రొడ్యూసర్ అవుతున్నాడు. ‘యాక్షన్’ సినిమా ట్రైలర్ ఇప్పుడే చూశాను. చాలా చాలా బాగుంది. విశాల్ హీరో, తమన్నా హీరోయిన్‌గా చేసిన సినిమా. సుందర్ సి. తన డైరెక్షన్‌తో చింపేశారు. ఫోటోగ్రఫీగానీ, ఎడిటింగ్‌గానీ, ప్రొడక్షన్ వేల్యూస్‌గానీ, చాలా చాలా బాగున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మా శ్రీనుకి ప్రొడ్యూసర్‌గా పెద్ద సూపర్‌హిట్ రావాలి. మంచి డబ్బులు రావాలి. బెస్ట్ ఆఫ్ లక్ టు ది టీమ్” అన్నారు.
నిర్మాత శ్రీనివాస్ ఆడెపు మాట్లాడుతూ “నా రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసినందుకు పూరి జగన్నాథ్‌గారికి చాలా థాంక్స్. ఆయన చేతులమీదుగా మా సినిమా ట్రైలర్ లాంచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి సినిమాతో నిర్మాతగా మారుతున్నాను. ఈ సినిమాలో మాస్ హీరో విశాల్ యాక్షన్ సీక్వెన్స్‌లన్నీ ఎంతో డెడికేటెడ్‌గా చేశారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. హిప్‌హాప్ తమిళ అందించిన సంగీతం సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. సుందర్ సి. ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అండర్ కవర్ మిషన్‌లో పనిచేసే మిలటరీ కమాండోగా విశాల్ కనిపిస్తారు. విశాల్ కెరీర్‌లోనే ఇది హయ్యస్ట్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌లోనే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. పూరిగారి బ్లెస్సింగ్స్‌తో సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
మాస్ హీరో విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటింగ్: ఎన్.బి.శ్రీకాంత్, నిర్మాత: శ్రీనివాస్ ఆడెపు, దర్శకత్వం: సుందర్ సి.