Advertisementt

శ‌ర్వానంద్ చిత్రంలో అమ‌ల అక్కినేని..!!

Sat 02nd Nov 2019 11:07 AM
amala akkineni,sharwanand,dream warrior pictures,mother role  శ‌ర్వానంద్ చిత్రంలో అమ‌ల అక్కినేని..!!
Amala Akkineni in Sharwanand Film శ‌ర్వానంద్ చిత్రంలో అమ‌ల అక్కినేని..!!
Advertisement
Ads by CJ

శ‌ర్వానంద్ హీరోగా డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న చిత్రంలో అమ‌ల అక్కినేని

శ‌ర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై శ్రీకార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారంనాడు (న‌వంబ‌ర్ 1)ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. అమ‌ల అక్కినేని ఈ చిత్రంలో శ‌ర్వానంద్ త‌ల్లిపాత్ర‌లో న‌టిస్తుంటే.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ తండ్రి, న‌టుడు ర‌వి రాఘ‌వేంద్ర హీరో తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నారు. సెల‌క్టివ్ సినిమాల్లోనే న‌టించే అమ‌ల అక్కినేని, క‌థ‌, త‌న పాత్ర న‌చ్చ‌డంతో ఈ సినిమాలో యాక్ట్ చేయ‌డానికి ఒప్పుకున్నారు.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర్వానంద్‌, అమ‌ల అక్కినేని, ర‌వి రాఘ‌వేంద్ర పాత్ర‌ల మ‌ధ్య కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ‘పెళ్ళిచూపులు’ ఫేమ్ రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. నాజ‌న్‌, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్నేహం, ప్రేమ మ‌ధ్య విడ‌దీయ‌రాని బంధాన్ని తెలియ‌జేసేలా ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ మాట‌లు అందిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతాన్ని, సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. రీసెంట్‌గా ‘ఖైదీ’ చిత్రంతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో స‌క్సెస్‌ను సాధించిన నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని కూడా తెలుగు, త‌మిళ భాష‌ల్లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2020 స‌మ్మ‌ర్‌లో గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:

శ‌ర్వానంద్‌, రీతూవ‌ర్మ‌, అమ‌ల అక్కినేని, ర‌వి రాఘ‌వేంద్ర‌, వెన్నెల‌కిషోర్‌, నాజ‌ర్‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: శ్రీకార్తిక్‌

నిర్మాత‌లు: ఎస్‌.ఆర్‌.ప్ర‌కాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు

మ్యూజిక్‌:  జాక్స్ బిజోయ్‌

సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ సారంగ్‌

ఎడిట‌ర్‌:  శ్రీజిత్ సారంగ్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ఎన్‌.స‌తీశ్ కుమార్‌

కాస్ట్యూమ్స్ స్టైలిస్ట్‌: ప‌ల్ల‌వి సింగ్‌

Amala Akkineni in Sharwanand Film:

Amala Akkineni in Sharwanand and Dream Warrior Pictures banner Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ