Advertisementt

‘తొంగి తొంగి చూడమాకు చందమామ’ టీజరొచ్చింది

Sat 02nd Nov 2019 11:04 AM
tongi tongi chudamaku chandamama,tongi tongi chudamaku chandamama teaser,tongi tongi chudamaku chandamama movie  ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’ టీజరొచ్చింది
Tongi Tongi Chudamaku Chandamama teaser Released ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’ టీజరొచ్చింది
Advertisement
Ads by CJ

దిలీప్, శ్రావణి జంటగా నటిస్తున్న సినిమా తొంగి తొంగి చూడమాకు చందమామ. జెమినీ సురేష్, ఈరోజుల్లో సాయి, కార్తీక్ అయినాల, రాజ్ బాలా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. గురు రాఘవేంద్ర సమర్పణలో హరి వల్లభ ఆర్ట్స్ సంస్థ తొంగి తొంగి చూడమాకు చందమామ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏ సునీత మోహన్ రెడ్డి నిర్మాత. యూత్, ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఆనంద్ కానుమోలు. యువతకు నచ్చే అంశాలతో ఆద్యంతం నవ్విస్తూనే మహిళల గొప్పదనం చెప్పేలా ఈ సినిమా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తొంగి తొంగి చూడమాకు చందమామ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ఫిలిం చాంబర్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ కానుమోలు మాట్లాడుతూ... చిన్న చిత్రాలకు అనేక సమస్యలుంటాయి. మాకు ఇబ్బంది కలిగిన సందర్భాల్లో నిర్మాత మోహన్ రెడ్డి గారు మాతో ఉండి ధైర్యం చెప్పారు. మమ్మల్ని ముందుకు నడిపించారు. నన్ను దర్శకుడిని చేసిన నిర్మాతకు ముందు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కోరుకున్న అమ్మాయిని దక్కించుకోవాలంటే ముందు ఆ అమ్మాయి మనసు గెల్చుకోవాలి అని చెప్పే చిత్రమిది. ఆకర్షణల మోజులో పడి అసలైన ప్రేమను నేటి యువత మర్చిపోతున్నారు. అలాంటి వారికి ప్రేమ గొప్పదనం తెలియజేసే సినిమా అవుతుంది. సందేశంతో పాటు ఆద్యంతం వినోదాత్మకంగా మా చిత్రం ఉంటుంది. అన్నారు.

హీరో దిలీప్ మాట్లాడుతూ.. మా నాన్న గోవిందరావు గారి ప్రోత్సాహంతో నేను హీరోగా ఇవాళ మీ ముందున్నాను. ప్రయత్నించి చూడు అంటూ ఆయన నన్ను ముందుకు నడిపించారు. దర్శకుడు ఆనంద్ గారు నేను ఈ పాత్రను చేయగలనా అనే సందేహం నుంచి ధైర్యాన్నిచ్చి, అంతా కొత్తవాళ్లమే చేసుకుంటూ వెళ్దాం అంటూ భరోసా ఇచ్చారు. ఇవాళ్టి యువతకు ఒక ప్రతినిధిగా ఈ చిత్రంలో కనిపిస్తా. కథలో నాకు ఎదురయ్యే కొన్ని సంఘటనల తర్వాత నిజమైన ప్రేమంటే ఏంటో తెలుసుకునే యువకుడిగా నటిస్తున్నా. అన్నారు.

నిర్మాత మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడు ఓ భిన్నమైన ప్రేమ కథతో మా దగ్గరకు వచ్చారు. కథను, దర్శకుడి ఆలోచనలు నమ్మి ఈ సినిమా నిర్మించాము. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ పూర్తి చేసి, నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

అనంత్, లావణ్య, మహేంద్రనాథ్, మాధవీ ప్రసాద్, శ్రీనివాసరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, ఎడిటర్ - ఈశ్వర్ 57, సినిమాటోగ్రఫీ - వివేక్ రఫీ ఎస్కే, సాహిత్యం - బాలాజీ, ఆర్ట్ - రమేష్, కొరియోగ్రఫీ - శ్రీనివాస్, వినయ్, ఫైట్స్ - రియల్ సతీష్

Tongi Tongi Chudamaku Chandamama teaser Released:

Tongi Tongi Chudamaku Chandamama Movie Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ