Advertisementt

దర్శకేంద్రుడు రిలీజ్ చేసిన ‘అప్పుడు-ఇప్పుడు’ పాట

Sat 02nd Nov 2019 10:59 AM
k raghavendra rao,appudu ippudu,movie,song,release  దర్శకేంద్రుడు రిలీజ్ చేసిన ‘అప్పుడు-ఇప్పుడు’ పాట
Appudu Ippudu Movie Second Song Released దర్శకేంద్రుడు రిలీజ్ చేసిన ‘అప్పుడు-ఇప్పుడు’ పాట
Advertisement
Ads by CJ

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా ‘అప్పుడు-ఇప్పుడు’ పాట విడుద‌ల‌.

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం  ‘అప్పుడు-ఇప్పుడు’.  శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య  ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. దసరా కానుక‌గా విడుద‌లైన  ఫస్ట్ లుక్ కి, కళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ చేతుల‌మీదుగా విడుదలైన మొదటి గీతానికి అద్భుతమైన  స్పంద‌న వ‌స్తోంది. కాగా ఈ చిత్రంలోని రెండవ పాటను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంగ్ చాలా బాగుంది. తప్పకుండా చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ - ‘‘ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారు రెండవ పాటను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు.  ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మేకింగ్ లో ఎక్కడా రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్  భరద్వాజ్ సంగీతం మా  సినిమాకు మంచి అసెట్ అయ్యాయి’’ అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘విజయదశమికి రిలీజ్ చేసిన‌ ఫస్ట్ లుక్ కి, కె.విశ్వ‌నాథ్ చేతుల‌మీదుగా విడుదలైన మొదటి గీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు  కె. రాఘవేంద్రరావు గారు విడుదల చేసిన సెకండ్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అని ఆశిస్తున్నాము. దర్శకుడు చలపతి పువ్వల, కొత్తవారైనా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లా చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలోనే  విడుదల తేదీని ప్రకటిస్తాం. ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్ గా ‘అప్పుడు-ఇప్పుడు’ తప్పకుండా మంచి విజ‌యం సాధిస్తుంది అనే న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు.

సుజన్, తనీష్క్ ,శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి ...

దర్శకత్వం: చలపతి పువ్వల,

నిర్మాతలు: ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణమ్ రాజు, 

సంగీతం: పద్మానావ్ భరద్వాజ్, 

సినిమాటోగ్రఫీ : కల్యాణ్ సమి, 

ఆర్ట్: ఠాగూర్,

ఎడిటింగ్: వి.వి.ఎన్.వి.సురేష్ ,

లిరిక్స్ః చిరావూరి విజయకుమార్,

పి.ఆర్‌.ఓః సాయి స‌తీష్‌.

Appudu Ippudu Movie Second Song Released:

K Raghavendra Rao Releases Appudu Ippudu Movie Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ