Advertisementt

విజయ్ అడిగాడంటే ఇవ్వాల్సిందే!

Sat 02nd Nov 2019 10:57 AM
vijay sethupathi,salary,demands,allu arjun,sukumar,movie  విజయ్ అడిగాడంటే ఇవ్వాల్సిందే!
Vijay Demands 6 Crores For Allu Arjun Movie విజయ్ అడిగాడంటే ఇవ్వాల్సిందే!
Advertisement
Ads by CJ

ఫామ్ లో ఉన్న హీరో.. విలన్ గా ఛాన్స్ వస్తే... ఆ విలన్ కి భారీ డిమాండ్ ఉంటుంది. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి హీరోగా మంచి క్రేజ్ ఉంది. అలాంటి విజయ్ విలనవతారమెత్తాడు అంటే... అతనికున్న డిమాండ్ మాములుగా ఉండదు. కేరెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన విజయ్ సేతుపతి భారీ డిమాండ్ ఉంది. తమిళనాట భారీ విజయాలందుకున్న విజయ్ సేతుపతిని తెలుగులో కేరెక్టర్ పాత్రలు తలుపుతట్టడమే కాదు.. విలన్ రోల్స్ కూడా ముద్దాడుతున్నాయి. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన లో విలన్ రోల్ చేస్తున్న విజయ్ అక్కడ భారీ పారితోషకమే అందుకున్నాడనే టాక్ ఉంది.

తాజాగా సుకుమార్ - అల్లు అర్జున్ సినిమాలోనూ విజయ్ సేతుపతి విలన్ అంటున్నారు. మరి భారీ బడ్జెట్ చిత్రం, స్టార్ హీరో సినిమాలో విలన్ రోల్ అంటే... విజయ్ డిమాండ్ భారీగానే ఉంటుంది. సుకుమార్ చిత్రంలో విలన్ గా చేస్తున్నందుకు... విజయ్ సేతుపతి 40 రోజుల షెడ్యూల్ కి 6 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే విజయ్ క్రేజ్ దృష్టిలో పెట్టుకున్న మైత్రి వారు విజయ్ సేతుపతి డిమాండ్ చేసిన 6 కోట్లు ఇవ్వడానికి సిద్దమంటున్నారట. మరి హీరో క్రేజ్ ఉంటే... డబ్బు రావడం మాములే.. విలన్ గా కూడా భారీగా సంపాదించొచ్చు... అనే సూత్రం విజయ్ బాగా వంట పట్టించుకున్నాడు.

Vijay Demands 6 Crores For Allu Arjun Movie:

Vijay Sethuipathi Salary for Allu Arjun and Sukumar Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ