Advertisementt

‘నిశ్శ‌బ్దం’లో అంజ‌లి లుక్ విడుద‌ల‌

Fri 01st Nov 2019 09:02 PM
anjali,nishabdam,movie,look,revealed  ‘నిశ్శ‌బ్దం’లో అంజ‌లి లుక్ విడుద‌ల‌
Anjali’s look from Nishabdam unveiled ‘నిశ్శ‌బ్దం’లో అంజ‌లి లుక్ విడుద‌ల‌
Advertisement
Ads by CJ

అభిన‌యంతో పాటు గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టిస్తూ హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ అంజ‌లి. తాజాగా ఈమె ‘నిశ్శ‌బ్దం’ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాకు అంజ‌లి లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న క్రాస్ ఓవ‌ర్ చిత్రం ‘నిశ్శ‌బ్దం’. సాక్షి అనే అమ్మాయిగా అనుష్క వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ఆమె పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అలాగే సినిమాలో మ‌రో ప్ర‌ధాన పాత్రధారి మాధ‌వ‌న్ లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. రీసెంట్‌గా సినిమా ప్రీ టీజ‌ర్ కూడా విడుద‌లై మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న అంజ‌లి లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల్లో గ్రాండ్‌ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:  గోపీ సుంద‌ర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్: నీర‌జ కోన‌, స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ: షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంక‌ట్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్,  స్టోరీ,  డైరెక్ష‌న్ - హేమంత్ మ‌ధుక‌ర్.

Anjali’s look from Nishabdam unveiled:

Anjali Plays Powerful Role in Nishabdam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ