ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ హిట్ తర్వాత రామ్ పోతినేని.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ సినిమాని రీసెంట్ గా మొదలుపెట్టాడు. ఇస్మార్ట్ హిట్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రామ్.. అంత గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాడు. రెడ్ సినిమా లుక్ కోసం మేకోవర్ కి టైం పట్టిందని చెబుతున్నాడు రామ్. మరి రెడ్ ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన రామ్.. ఈ సినిమాని తమిళంలో సూపర్ హిట్ అయిన తడమ్ సినిమాకి రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. అందులో నిజమెంతుందో అనేది రామ్ గాని, దర్శకుడు గాని స్పందిస్తే తెలుస్తుంది.
మరి తడమ్ ని రీమేక్ చేస్తున్నారా? లేదంటే తడమ్ స్ఫూర్తితో ఈ రెడ్ తెరకెక్కుతుందా? అనేది తెలియాలి. కాకపోతే రామ్ మాత్రం ఇదో ఫ్రెష్ స్టోరీ అన్నట్టుగా సినిమాని మొదలు పెట్టాడు. ఇకపోతే తడమ్ డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా రియల్ లైఫ్ క్రైమ్స్ ఆధారంగా తెరకెక్కింది. మరి అదే సినిమా రీమేక్ అయితే మాత్రం రామ్ రెడ్ తో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టినట్లే. ఎందుకంటే ఆ సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు యమా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మరి రామ్ తన రెడ్ సినిమాని వేసవి సెలవులు కానుకగా ఏప్రిల్ లో విడుదల చెయ్యబోతున్నాడు. అలా ఏప్రిల్ లో రెడ్ సినిమా డేట్ ఇచ్చి వేసవి విడుదల సినిమాల్లో మొదటగా విడుదలవుతున్న సినిమా రెడ్ ని నిలిపాడు రామ్.