పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీతో సినిమాలోకొస్తాడు.. వస్తాడు అంటూ ప్రచారం జరగడమే కానీ.. పవన్ కళ్యాణ్ ఎక్కడా నోరు విప్పి తన రీ ఎంట్రీ న్యూస్‌ని పక్కాగా క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ కథలు వింటున్నాడని అంటున్నారు. మరో పక్క క్రిష్ తో సినిమాకి పవన్ తయారవుతున్నాడని అంటున్నారు. ఇక క్రిష్ కూడా పవన్ కళ్యాణ్ హీరోయిజానికి తగ్గట్టుగా ఓ జానపద కథని డెవెలెప్ చేసుకోవడం, పవన్ తో ఓకె చెప్పించుకోడం కూడా జరిగాయట. ఇక పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలతో పాటుగా.. సినిమాల కోసం కాస్త డైటింగ్ గట్రా చేసి బాడీ ని ఫిట్ చేసుకుంటున్నాడని టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.
తాజాగా పవన్ కళ్యాణ్ - క్రిష్ ల సినిమా నవంబర్ 15 నుండి మొదలు కాబోతుందనే న్యూస్ మాత్రం ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏ.ఎం.రత్నం నిర్మాతగా... క్రిష్ దర్శకుడిగా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఫిలిం పక్కాగా ఓకె అయ్యిందట. మరి నవంబర్ 15 నుండి మొదలు కాబోయే ఈ సినిమా కోసం పవన్ ఫుల్ డైట్ కూడా చేస్తున్నాడని.. ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటూ వెయిట్ తగ్గుతున్నాడట. మరి క్రిష్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ కూడా చేయబోతున్నాడని అంటున్నారు. మరి రాజకీయాలతో పవన్ సినిమాల మీద సినిమాలు చెయ్యడానికి ఖాళీ దొరుకుతుందో లేదో.. ఈ సినిమాలు పూర్తయితే గాని తెలియదు.