Advertisementt

బాలకృష్ణ - బోయపాటి సినిమాలో మోక్షజ్ఞ!?

Fri 01st Nov 2019 01:05 PM
mokshagna,balayya-boyapati movie,balakrishna,boyapati sreenu  బాలకృష్ణ - బోయపాటి సినిమాలో మోక్షజ్ఞ!?
Mokshagna Entry with Balayya-Boyapati Movie! బాలకృష్ణ - బోయపాటి సినిమాలో మోక్షజ్ఞ!?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ ప్రస్తుతం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమా చేస్తున్నాడు. కథానాయకుడు, మహానాయకుడు దెబ్బకి బాగా సైలెంట్ అయిన బాలయ్య బాబు ‘రూలర్’ షూటింగ్ తో దూసుకుపోతున్నాడు. డిసెంబర్ 20న రూలర్ విడుదల డేట్ కూడా ఇచ్చేసారు. ఇక రూలర్ సినిమా తర్వాత బోయపాటితో మరో పవర్ ఫుల్ ఎంటర్టైనర్ చెయ్యబోతున్నాడు బాలకృష్ణ. ఓన్ బ్యానేర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలకృష్ణ కేరెక్టర్‌ని బాగా పవర్ ఫుల్‌గా డిజైన్ చేస్తున్నాడట బోయపాటి. ‘వినయ విధేయరామ‘ తర్వాత బోయపాటి కూడా అజ్ఞాతంలో ఉన్నాడు. తాజాగా బాలయ్య సినిమాతో వార్తల్లకొచ్చిన బోయపాటి.. ఇప్పుడు బాలకృష్ణ సినిమా స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా వున్నాడు.

ఇకపోతే ఎప్పటినుండో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై వార్తలొస్తున్నాయి. 2018 లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య హింట్ ఇచ్చినా.. మోక్షజ్ఞ ఎంట్రీ జరగలేదు. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడా..? అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ ఇప్పుడు సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, అది కూడా బోయపాటి - బాలయ్య సినిమా ద్వారా అని తెలుస్తుంది. అయితే ఈ న్యూస్ లో నిజమెంతుందో తెలియదు కానీ... బోయపాటి, మోక్షజ్ఞ పాత్రని ఎలా డిజైన్ చేస్తాడు? అసలు సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా ఉంటుందో? అంటూ అభిమానులు అప్పుడే హాట్ హాట్ చర్చలకు తెర లేపారు. 

 

Mokshagna Entry with Balayya-Boyapati Movie!:

Mokshagna Entry with Balayya-Boyapati Movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ