టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు, సంచలనాకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన రామ్‌గోపాల్ వర్మ ఇప్పటికే నారా, నందమూరి కుటుంబాలను టార్గెట్ చేస్తూ సినిమా తెరకెక్కించిన విషయం విదితమే. ఇక తీయాల్సిన సినిమాలేమీ లేవనుకున్నాడో.. లేకుంటే ఏదో ఒకటి వివాదాన్ని సృష్టించాలి కదా అని చెప్పి ఇలా చేశారో కానీ.. టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్న మెగా ఫ్యామిలీని ఆర్జీవీ టార్గెట్ చేశారు. తాను ‘మెగా ఫ్యామిలీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.. అయితే ఈ ప్రకటన ఏ టైమ్‌లో.. ఏ మూడ్‌లో చేశారో ఏమోగానీ... తెల్లారే సరికి అబ్బే నేను ‘మెగా ఫ్యామిలీ’ సినిమా తెరకెక్కించడమే అస్సలు అది జరగని.. కాని పని అంటూ తిన్నగా సైలైంట్ అయిపోయారు. ఆర్జీవీ ఇలా సైలెంట్ అవ్వడం వెనుక పెద్ద కారణమే ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయ్.
ఇప్పటికే పలుమార్లు తన ఫ్యామిలీని టచ్ చేసినప్పటికీ మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్ కల్యాణ్ మాత్రమే స్పందించిన విషయం విదితమే. అయితే ఇంతవరకూ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఆర్జీవీని పొల్లెత్తి మాట కూడా అనలేదు. బహుశా ఆయనేమీ అనలేదేమోననే వర్మ అప్పట్లో ఆ రేంజ్‌లో రెచ్చిపోయారేమో!. తాజాగా ‘మెగా ఫ్యామిలీ’ అని ప్రకటించిన కొన్ని గంటలకే విషయం తెలుసుకున్న చిరంజీవి తీవ్ర ఆగ్రహానికి లోనై.. ఇలాంటి వ్యవహారాలన్నింటికి ఆదిలోనే ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించారట. అందుకే.. ‘అసలేంటి మీ ప్రాబ్లమ్.. ఎందుకిలా చేస్తున్నారు.. ఏంటి పిచ్చిపిచ్చిగా ఉందా..? ఇలాంటి సిల్లీ ప్రయత్నాలు మానుకోండి.. మరోసారి ఇలాంటి పనులు చేయమాకండి ఆర్జీవీ’.. అని మెగాస్టార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం. వాస్తవానికి ఎవరైనా తనపై.. తన ఫ్యామిలీపై అకారణంగా బురద జల్లాలని చూస్తే చిరంజీవి అంత తేలికగా తీసుకోరన్న విషయం విదితమే. మరి ఇందులో నిజమెంతో..? అబద్ధమెంతో తెలియాలంటే ఆర్జీవీ రియాక్ట్ అవ్వాల్సిందే మరి.