Advertisementt

ఆర్జీవీ.. కమ్మరాజ్యంపై లీడర్ నుంచి ఫస్ట్ రియాక్షన్!

Thu 31st Oct 2019 02:51 PM
kamma rajyamlo kadapa redlu,rgv,ramgopal varama,jayaprakash narayan  ఆర్జీవీ.. కమ్మరాజ్యంపై లీడర్ నుంచి ఫస్ట్ రియాక్షన్!
First Reaction From Leaders Over Kamma rajyamlo kadapa redlu ఆర్జీవీ.. కమ్మరాజ్యంపై లీడర్ నుంచి ఫస్ట్ రియాక్షన్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు, సంచలనాకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. ఇప్పటికే ఈ సినిమాలోని ఫస్ట్ లుక్స్, సాంగ్స్‌ను రిలీజ్ చేసిన ఆర్జీవీ.. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేసి సంచలన సృష్టిస్తున్నారు. ఇటు వైసీపీ.. అటు టీడీపీ నేతల్లో అలజడి సృష్టించారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాదు.. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నేతలకు కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే తాము రియాక్ట్ అయితే ఆర్జీవీ స్పందన ఎలా ఉంటుందో ఏమో.. అనవసరంగా రియాక్ట్ అవ్వడం కంటే సైలెంట్‌గా ఉండిపోవడమే బెస్ట్ అని భావించి మిన్నకుండిపోయారట. అయితే పొలిటికల్ లీడర్స్ నుంచి ఫస్ట్ టైమ్ లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) రియాక్ట్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూ వేదికగా జేపీ స్పందిస్తూ ఒకింత స్వీట్ వార్నింగ్ ఇస్తూ సలహాలు, సూచనలు సైతం చేశారాయన.

ఆర్జవీ లాంటి క్రియేటివ్ ఆలోచనలు ఉన్న డైరెక్టర్ ఇలాంటి సినిమాలు చేయడమేంటి..? ఆర్జీవీ ఇలాంటి సినిమాలు కూడా తీస్తారని నేను ఊహించలేదు. కులాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి చర్యలు మంచివికావు. సరదా కోసం, నవ్వించేందుకు ఏమైనా చేసుకోవచ్చు.. అంతేకానీ కానీ ఇలా సమాజంలోని ప్రజల మధ్య చిచ్చుపెట్టడం పద్ధతి కాదు. మనం పోయిన తర్వాత మనల్ని జనం గుర్తుంచుకునేలా పనులు చేయాలే తప్ప.. సమాజంలో చీలిక తీసుకొచ్చే ప్రయత్నాలు ఎవరు చేయకూడదు. సోషల్ మీడియాలో షేర్లు, లైక్‌ల కోసం ఇలాంటివి చేయడం వల్ల ఎవరూ పాపులర్ కాలేరు’ అని జేపీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జేపీ స్వీట్ వార్నింగ్‌పై ఆర్జీవీ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి మరి.

First Reaction From Leaders Over Kamma rajyamlo kadapa redlu:

First Reaction From Leaders Over Kamma rajyamlo kadapa redlu  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ