Advertisementt

తండ్రి ప్రేమతో ‘పప్పు’ వడ్డిస్తే తప్పేంటి!?

Thu 31st Oct 2019 02:43 PM
rgv,ramgopal varma,pappu,kamma rajyamlo kadapa redlu  తండ్రి ప్రేమతో ‘పప్పు’ వడ్డిస్తే తప్పేంటి!?
RGV Gives Clarity Over PAPPU in kamma rajyamlo kadapa redlu తండ్రి ప్రేమతో ‘పప్పు’ వడ్డిస్తే తప్పేంటి!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు, సంచలనాకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన రామ్‌గోపాల్ వర్మ కొత్త చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’. వివాదాలే ఊపిరిగా భావించే ఆర్జీవీకి ఇలాంటి వివాదాస్పద సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్ష పార్టీలను ఓ రేంజ్‌లో టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారంతే. ఇటీవల రీలీజ్ అయిన ట్రైలర్‌లో ఇరు పార్టీ నేతలను గట్టిగానే విమర్శిస్తూ చూపించడం గమనార్హం. కాగా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది..? ట్రైలర్‌లో ఉన్నట్లే సినిమాలో ఉంటుందా..? లేకుంటే అస్సలు ఉండదా..? అనేది బహుశా ఆర్జీవీకే క్లారిటీ ఉందో లేదో తెలియని పరిస్థితి. అయితే సినిమాకు సంబంధించి మాత్రం అటు సోషల్ మీడియాలో ఇటు ఇంటర్వ్యూల వేదికగా పక్కా ప్లాన్ ప్రకారమే ప్రమోషన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. 

సినిమాపై ఇంటర్వ్యూలు, స్పెషల్ డిబెట్స్ బాట పట్టిన ఆర్జీవీ ఇటీవల.. అసలు మూవీలో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు పాత్రధారుడు.. ఆయన కుమారుడికి ‘పప్పు’ వడ్డిస్తున్న పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయ్.. దీనిపై మీరేమంటారు..? అసలు మీరెందుకు ఇలా చేస్తున్నారు..? అనే ప్రశ్నలు ఎదురైంది. ఈ ప్రశ్నకు కూడా ఎక్కడలేని లాజిక్స్ వెతికి.. తిక్క తిక్కగానే సమాధానం చెబుతూ ఎదురుప్రశ్న సంధించారు.

‘చంద్రబాబు.. లోకేష్‌కు పప్పు వడ్డిస్తే తప్పేంటి..?. ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు..? ఈ విషయాన్ని ఎందుకలా భూతద్దంలో పెట్టి మరీ చూస్తున్నారు..?. అసలు లోకేష్‌ను అంతా పప్పు అంటారా..? అసలు ఈ విషయం నాకు తెలియదే. అవునా.. నేనైతే ఫస్ట్ టైమ్ వింటున్నాను. ఒక తండ్రి తన కుమారుడికి ప్రేమతో భోజనం వడ్డిస్తుంటే.. అందులో తప్పేంటి..? ఇక పప్పు చాలామంది ఇళ్లలో డైలీగా వండుకుంటారు’ అని వెటకారంగా, మ్యానరిజంతో ఆర్జీవీ మాట్లాడారు. అయితే ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో టీడీపీ వీరాభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కామెంట్స్ వర్షం కురిపిస్తుండగా.. టీడీపీ నుంచి మాత్రం ఇంతవరకూ ఒక్క తెలుగు తమ్ముడూ స్పందించలేదు.

RGV Gives Clarity Over PAPPU in kamma rajyamlo kadapa redlu:

RGV Gives Clarity Over PAPPU in Kamma rajyamlo kadapa redlu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ