దీపావళి సందర్భంగా 1945 మూవీ హీరో రానా వెర్సెస్ నిర్మాత న్యూస్ బాగా హైలెట్ అయ్యింది. రానా 1945 మూవీతో సంబంధం లేదని, ఆ ఫస్ట్ లుక్ ఎందుకిచ్చారో వారికే తెలియాలని సినిమా సగం మాత్రమే పూర్తయ్యింది కానీ పూర్తిగా పూర్తి అవలేదని, తన పాత్ర షూటింగ్ చాలా వరకు మిగిలే ఉంది ఇలా లుక్స్ రిలీజ్ చేసి సినిమా అమ్ముకోవాలని చూస్తే బయ్యర్లు నష్టపోతారంటూ 1945 మూవీపై స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక 1945 మూవీ నిర్మాతేమో... సినిమా పూర్తయ్యిందని, రానాకి నచ్చకపోతే... సైలెంట్ గా ఉండమన్నాడు.
తాజాగా 1945 మూవీ దర్శకుడు శివ మాత్రం 1945 పూర్తవడమే కాదు.. ఇప్పటికే శాటిలైట్ బిజినెస్ జరిగిందని, ఫైనల్ వెర్షన్ బాగా వచ్చిందని, రానా కూడా తమిళ వెర్షన్ డబ్బింగ్ కూడా చెప్పాడని, నిర్మాతకి, రానాకీ మధ్యనేమైనా విభేదాలుంటే పరిష్కరించుకోవాలని, అలాగే సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రానా, నిర్మాత కూర్చుని మాట్లాడుకోవాలని అంటున్నాడు. మరి నిర్మాత - రానా మధ్యలో డైరెక్టర్ నలిగిపోతున్నట్లుగా కనబడుతుంది ఇక్కడి వ్యవహారం.