Advertisementt

అది నా బాధ్యత: విజయ్ దేవరకొండ

Thu 31st Oct 2019 08:06 AM
vijay deverakonda,meeku matrame chepta,pre release,event  అది నా బాధ్యత: విజయ్ దేవరకొండ
Meeku Matrame Chepta Pre Release event Highlights అది నా బాధ్యత: విజయ్ దేవరకొండ
Advertisement
Ads by CJ

కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చెయ్యడం నా బాధ్యత, సినిమా ఔట్ పుట్ సంతృప్తిని ఇచ్చింది. మీకు మాత్రమే చెప్తా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ.!!!

తరుణ్‌ భాస్కర్‌ హీరోగా, షామీర్ సుల్తాన్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’ ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్, సురేష్ బాబు, మధురా శ్రీధర్, కె.ఎస్.రామారావు, పరుశురాం, శివ నిర్వాణ, ఛార్మి, తరుణ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త టెక్నీషియన్స్ అందరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. మా సినిమాను దీవించడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు. ముఖ్యంగా నిర్మాత సురేష్ బాబు గారికి థాంక్స్, ఆయన నా మొదటి సినిమా నుండి సపోర్ట్ చేస్తున్నారు. డైరెక్టర్స్ పూరి గారు, పరుశురాం, శివ నిర్వాణ నాకోసం ఈ ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది. నేను 5, 6 ఏళ్ల క్రిందట టీవీలో సినిమా సెలెబ్రిటీస్ ను చూసేవాడిని, వారిని చూసి నేను కూడా ఒక నటుణ్ని అవ్వాలనే కోరిక ఉండేది, ఆ సమయంలో నాన్న నన్ను పూరి గారి దగ్గర వర్క్ చెయ్యమని చెప్పారు. ఇప్పుడు పూరి గారితో సినిమా చేయడం మర్చిపోలేని అనుభూతి. కలలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడండి. నన్ను చాలామంది సపోర్ట్ చెయ్యడంతో ఈ స్థానంలో ఉన్నాను కావున నేను కొత్త వారిని సపోర్ట్ చేస్తున్నాను. తరుణ్ భాస్కర్, పరుశురాం, సందీప్ రెడ్డి వంగ నా సక్సెస్ కు కారణం. మీకు మాత్రమే చెప్తా సినిమా అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ... విజయ్ దేవరకొండ డాడీ గోవర్ధన్ మంచి వ్యక్తి మేము కలిసి వర్క్ చేశాము. విజయ్ చేస్తున్న ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్న. ట్రైలర్ బాగుంది, సినిమాలో నటించిన అందరూ నటీనటులు బాగా యాక్ట్ చేశారు. విజయ్ దేవరకొండ చేస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్న. మీ లాగే నేను మీకు మాత్రమే చెప్తా సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను, ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్న అన్నారు. 

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ... నేను ఎదుగుతున్న సమయంలో మా నాన్న సపోర్ట్ మరువలేనిది. నాకు నటన అనేది ఇష్టం కావున నేను నటిస్తూ వెళుతున్న. డైరెక్టర్ షమ్మిర్ బాగా కష్టపడి ఈ సినిమా తీశారు. విజయ్ దేవరకొండ చేస్తున్న అన్ని ప్రయత్నాలు సక్సెస్

కావాలని కోరుకుంటున్న, తాను నిర్మించిన ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ... అందరికి నమస్కారం. విజయ్, తరుణ్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ పర్సన్స్, వారు ఎదిగిన విధానం చూస్తుంటే ముచ్చటగా ఉంది. మీకు మాత్రమే చెప్తా ట్రైలర్ చూశాను బాగా నచ్చింది. చిన్న సినిమాలను సపోర్ట్ చేసే విజయ్ దేవరకొండకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. నవంబర్ 1న విడుదల కాబోతున్న ఈ సినిమాను అందరూ చూసి హిట్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.

నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ... నేను ఈ సినిమా చూశాను, నాకు బాగా నచ్చింది. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. కామెడీ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆధారిస్తూ ఉంటారు. ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది. సినిమా సక్సెస్ అవుతుందని ముందే చిత్ర యూనిట్ సభ్యులకు కంగ్రాట్స్ చెబుతున్నాను అన్నారు.

డైరెక్టర్ షామీర్ మాట్లాడుతూ... నాకు ఈ సినిమా చెయ్యడానికి అవకాశం ఇచ్చిన విజయ్ దేవరకొండ, వర్ధన్ గారికి థాంక్స్. తరుణ్ భాస్కర్ రాకేష్ పాత్రలో ఎనర్జీగా నటించాడు, షూటింగ్ సమయంలో తను నాకు బాగా సపోర్ట్ చేసాడు. మ్యూజిక్, ఎడిటింగ్ ఇలా అన్ని

విభాగాల సినిమా కోసం కష్టపడి పనిచేశారు. అభినవ్, అనసూయ పాత్రలు ప్రేక్షకులను అలరిస్తాయి. మీకు మాత్రమే చెప్తా చిత్రం విడుదల తరువాత అందరి పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.  ఆడియన్స్ సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తారన్నారు.

నటి అనసూయ మాట్లాడుతూ... నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో మరో మంచి పాత్రతో మీ ముందుకు వస్తున్న. అభినవ్, తరుణ్ భాస్కర్, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. సినిమా తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. విజయ్ దేవరకొండ, గోవర్ధన్ గారికి స్పెషల్ థాంక్స్ తెలిపారు.

ఆర్టిస్ట్ అభినవ్ గోమటం మాట్లాడుతూ... మీకు మాత్రమే చెప్తా సినిమా ప్రీ రిలీస్ ఈవెంట్ కు వచ్చిన అందరికి ధన్యవాదాలు. షామీర్ ఈ సినిమాను బాగా తీసాడు, తెలుగు రాకపోయినా నేర్చుకొని మూవీ చేశాడు, సినిమా బాగా వచ్చింది. నవంబర్ 1న సినిమా చూడ్డానికి వచ్చిన ఆడియన్స్ కు సినిమా బాగా నచ్చుతుంది. నిర్మాత గోవర్ధన్ గారికి స్పెషల్ థాంక్స్. తరుణ్ భాస్కర్ ఎంత మంచి దర్శకుడో అంత మంచి నటుడిని ఈ సినిమా చూశాక అందరూ అంటారని తెలియజేసారు.

డైరెక్టర్ పరుశురాం మాట్లాడుతూ... గీత గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొండకు కాల్ చేస్తే మీకు మాత్రమే చెప్తా సినిమా గురించి చెప్పాడు. విజయ్ తో సినిమాలు చేసిన అందరూ నిర్మాతలకు మంచి డబ్బు వచ్చింది. తాను నిర్మాతగా చేస్తున్న ఈ సినిమా సక్సెస్ అయ్యి మంచి పేరు రావాలని కోరుకుంటున్న. హీరోగా సక్సెస్ అయినట్లు నిర్మాతగా సక్సెస్ అవ్వాలని తెలిపారు.

హీరోయిన్ వాని భోజన్ మాట్లాడుతూ... మంచి టీమ్ తో వర్క్ చేశానన్న తృప్తి ఉంది, నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ గారికి, వర్ధన్ గారికి ధన్యవాదాలు. నవంబర్ 1న సినిమాను థియేటర్ లో చూసి మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు.

హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ.. మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. మంచి కథ, కథనాలతో ఈ సినిమా

ఉండబోతోంది, మీ అందరికి నా రోల్ నచ్చుతుందని అనుకుంటున్నాను అన్నారు.

Meeku Matrame Chepta Pre Release event Highlights:

Celebrities speech at Meeku Matrame Chepta Pre Release event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ