Advertisementt

బన్నీ లెక్క: వేణు శ్రీరామ్ అవుట్, సుక్కు ఇన్!

Thu 31st Oct 2019 07:47 AM
allu arjun,venu sriram,icon,sukumar,dil raju,allu arjun movies  బన్నీ లెక్క: వేణు శ్రీరామ్ అవుట్, సుక్కు ఇన్!
Allu Arjun and Venu Sriram Movie Shelved బన్నీ లెక్క: వేణు శ్రీరామ్ అవుట్, సుక్కు ఇన్!
Advertisement
Ads by CJ

నిన్నటివరకు సుకుమార్ చెప్పిన కథకు అల్లు అర్జున్ ఇంకా కనెక్ట్ కాలేదని, అందుకే సుకుమార్ - అల్లు అర్జున్‌ల కాంబోలో తెరకెక్కబోయే సినిమా దసరాకి ఓపెనింగ్ చేసుకోలేదని ప్రచారం జరిగింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ మీద నడిచే స్టోరీతో అల్లు అర్జున్ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చెయ్యబోతున్న విషయం తెలిసిందే. అయితే స్టోరీ డెవలప్‌మెంట్‌లో సుకుమార్ తడబడుతున్నాడని, స్టోరీ లైన్ ఓకే గాని, పూర్తి స్క్రిప్ట్‌తో సుకుమార్, అల్లు అర్జున్‌ను మెప్పించలేకపోతున్నాడని అన్నారు. ఇక త్రివిక్రమ్ సినిమా తర్వాత అల్లు అర్జున్, వేణు శ్రీరామ్‌తో ఐకాన్ సినిమా సెట్స్ మీదకెళ్ళిపోతాడననుకున్నారు.

ఎందుకంటే వేణు శ్రీ రామ్ చెప్పిన కథకి అల్లు అర్జున్ ఇంప్రెస్ అవడమే కాదు.... ఆ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఎప్పుడో బయటికొచ్చేసింది. అయితే సుకుమార్ సినిమాని పక్కన బెట్టి అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ ఐకాన్ మొదలెడతాడు అనుకుంటున్న టైం లో... అందరికి షాకిస్తూ సుకుమార్ సినిమాని ఈ రోజు(బుధవారం) మొదలెట్టేశాడు అల్లు అర్జున్. ఇక వేణు శ్రీరామ్‌తో చెయ్యాల్సిన ఐకాన్ అటకెక్కిందనే న్యూస్ మొదలైంది. ముందుగా వేణు శ్రీరామ్ లైన్ చెప్పినప్పుడు ఓకేనన్న అల్లు అర్జున్... పూర్తి కథను చెప్పిన తరువాత అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఈ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడిందంటున్నారు. మరి అల్లు అర్జున్ చేతిలో సుకుమార్ బుక్కవుతాడనుకుంటే... వేణు శ్రీరామ్ బుక్కయ్యాడుగా అంటూ సోషల్ మీడియాలో ఒకటే వార్తలు.

Allu Arjun and Venu Sriram Movie Shelved :

Allu Arjun and Sukumar Movie Started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ