Advertisementt

అల్లు అర్జున్, సుక్కు హ్యాట్రిక్ ఫిల్మ్ ప్రారంభం

Wed 30th Oct 2019 09:59 PM
allu arjun,sukumar,mythri movie makers,muttam shetty media,aa20 film launched  అల్లు అర్జున్, సుక్కు హ్యాట్రిక్ ఫిల్మ్ ప్రారంభం
Allu Arjun and Sukumar Combo 3rd Film Launched అల్లు అర్జున్, సుక్కు హ్యాట్రిక్ ఫిల్మ్ ప్రారంభం
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందించే క్రేజీ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కించే క్రేజీ మూవీ బుధవారం (అక్టోబర్ 30న) ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్... ముత్తంశెట్టి మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 

ఆర్య, ఆర్య 2 చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో సినీ వర్గాల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడం విశేషం. గతంలో అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్య, ఆర్య 2 మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. అలాగే బన్నీ మరియు దేవి కాంబినేషన్‌లో వచ్చిన బన్నీ, సన్ ఆఫ్ సత్యమూర్తి, డీజే సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. మరోసారి వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా.. మ్యూజిక్ లవర్స్ తో పాటు డాన్స్ లవర్స్ ను కూడా ఆకట్టుకోబోతోంది. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో తెలియజేస్తారు.

నటీనటులు :

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (హీరో)

రష్మిక మందన్న (హీరోయిన్)

సాంకేతిక నిపుణులు : 

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ (ప్రొడక్షన్ నెంబర్ 11)

సహ నిర్మాత - ముత్తంశెట్టి మీడియా

డైరెక్టర్: సుకుమార్

ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై

కెమెరామెన్: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్

మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్

ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్

ఆర్ట్ డైరెక్టర్: ఎస్.రామకృష్ణ , మౌనిక

సి.ఈ.ఓ: చెర్రీ

లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కె.వి.వి

పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను - మధు మడూరి

Allu Arjun and Sukumar Combo 3rd Film Launched:

Allu Arjun and Sukumar Movie in Mythri Movie Makers and Muttam Shetty Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ