Advertisementt

‘ప్రెష‌ర్ కుక్క‌ర్’ థియేట్రిక‌ల్ హ‌క్కులెవరికంటే..?

Wed 30th Oct 2019 08:45 PM
abhishek pictures,acquires,pressure cooker,theatrical rights  ‘ప్రెష‌ర్ కుక్క‌ర్’ థియేట్రిక‌ల్ హ‌క్కులెవరికంటే..?
‘Pressure Cooker’ Movie Theatrical Rights Sold out ‘ప్రెష‌ర్ కుక్క‌ర్’ థియేట్రిక‌ల్ హ‌క్కులెవరికంటే..?
Advertisement
Ads by CJ

స‌క్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూట‌ర్‌, నిర్మాత అభిషేక్ పిక్చ‌ర్స్ అభిషేక్ నామా ‘ప్రెష‌ర్ కుక్క‌ర్‌’ థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’, ‘రాక్ష‌సుడు’ వంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చ‌ర్స్ అభిషేక్ నామా రీసెంట్‌గా ‘జార్జ్‌రెడ్డి’ సినిమా హ‌క్కుల‌ను కూడా సొంతం చేసుకున్నారు.

సాయిరోన‌క్‌, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘ప్రెష‌ర్ కుక్క‌ర్‌’. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. కాన్సెప్ట్ నచ్చిన డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ఈ సినిమా టీజ‌ర్‌ను క‌ట్ చేయ‌డం విశేషం. సుజోయ్‌, సుశీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. సునీల్ క‌శ్య‌ప్‌, రాహుల్ సిప్లిగంజ్‌, స్మ‌ర‌ణ్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. క‌ర‌మ్‌పురి క్రియేష‌న్స్‌, మైక్ మూవీస్ ప‌తాకాల‌పై సుజోయ్‌, సుశీల్‌, అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి దర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

న‌టీన‌టులు:

సాయిరోన‌క్‌, ప్రీతి అస్రాని, రాహుల్ రామ‌కృష్ణ‌, రజ‌య్ రోవాన్‌, తనికెళ్ల భ‌ర‌ణి, సీవీఎల్ న‌ర‌సింహారావు త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: సుజోయ్‌, సుశీల్‌

నిర్మాత‌లు: సునీల్‌, సుజోయ్‌, అప్పిరెడ్డి

సినిమాటోగ్ర‌పీ: న‌గేష్ బానెల్‌, అనిత్ మ‌డాడి

సంగీతం: సునీల్ క‌శ్య‌ప్‌, రాహుల్ సిప్లిగంజ్‌, స్మ‌ర‌ణ్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌

బీజీఎం: హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌

ఎడిట‌ర్‌: న‌రేష్ రెడ్డి జొన్న‌

పి.ఆర్‌.ఓ: వంశీశేఖ‌ర్‌

‘Pressure Cooker’ Movie Theatrical Rights Sold out :

Abhishek Pictures Acquires ‘Pressure Cooker’ Movie Theatrical Rights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ