రవితేజ, గోపీచంద్ మలినేని సినిమాలో హీరోయిన్‌గా శృతి హాసన్..
మాస్ మహారాజా రవితేజ 66వ సినిమాను దివాళి సందర్భంగా ఈ మధ్యే ప్రకటించారు. కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. డాన్ శీను, ‘బలుపు’ లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించబోతున్నారు. 2017లో తెలుగు సినిమాలో నటించారు శృతి హాసన్.. ఇప్పుడు రవితేజ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తున్నారని చెబుతున్నారు చిత్రయూనిట్. రవితేజ, శృతి హాసన్ కలిసి నటించబోయే రెండో సినిమా ఇది. బలుపులో ఇప్పటికే ఓ సారి నటించారు ఈ జోడీ. ఆ సినిమాను కూడా గోపీచంద్ మలినేని తెరకెక్కించడం విశేషం. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మంచి కథను సిద్ధం చేస్తున్నారు దర్శకుడు గోపీచంద్. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పవర్ ఫుల్ పోలీస్ కథతో వస్తున్నారు గోపీచంద్ మలినేని. బి మధు ఈ చిత్రానికి నిర్మాత. నవంబర్‌లో సినిమా ఓపెనింగ్ జరగనుంది. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
నటీనటులు: రవితేజ, శృతిహాసన్
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: గోపీచంద్ మలినేని
నిర్మాత: బి మధు