టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు, సంచలనాకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన రామ్‌గోపాల్ వర్మ కొత్త చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’. వివాదాలే ఊపిరిగా భావించే ఆర్జీవీ ఇలాంటి వివాదాస్పద సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్ష పార్టీలను ఓ రేంజ్‌లో టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల రీలీజ్ అయిన ట్రైలర్‌లో ఇరు పార్టీ నేతలను క్రూరాతి క్రూరంగా చూపించడం గమనార్హం. దీపావళికి ఆర్జీవీ పేల్చిన ట్రైలర్ బాంబు గట్టిగా పేలింది.. మిలియన్లలో వ్యూస్ వచ్చాయ్. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
>ఈ సినిమాలో అచ్చుగుద్దినట్లుగా వైఎస్ జగన్, చంద్రబాబు, కేఏ పాల్, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లను దింపేశారు. మరోవైపు స్పీకర్‌గా వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారాంను కమెడియన్ అలీ రూపంలో దించేశారు. అయితే ఇంతవరకూ అంతా ఓకే గానీ.. సినిమాలో నటించాలని ఇండస్ట్రీకి ఓ ఇద్దరూ ప్రముఖ కమెడియన్స్‌ను సంప్రదించగా మొదట ఓకే అన్న వాళ్లు.. పాత్ర చెప్పగా అబ్బో మేం అస్సలు చేయలేం బాబోయ్ అని తిన్నగా తప్పించుకున్నారట. ఆ ఇద్దరూ మరెవరో కాదు.. ఇటు టాలీవుడ్‌లో.. అటు వైసీపీలో ఓ వెలుగు వెలుగుతున్న నటులని టాక్ నడుస్తోంది. వీరిలో ఒకరు కీలక పదవిలో ఉండగా.. మరొకరు పదవి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయికళ్లతో వేచిచూస్తున్నారు. ఈ చిన్న క్లూతో ఆ ఇద్దరు నటులు ఎవరో అర్థమైపోయింటుంది.
>వాస్తవానికి అటు టీడీపీని.. ఇటు వైసీపీని ఓ రేంజ్‌లో ట్రైలర్‌లో ఏకిపారేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆ ఇద్దరు నటులు.. హమ్మయ్యా ఈ సినిమాలో నటించకపోవడమే మంచిదైంది లేకుంటే వైసీపీ నేతలు మనల్ని ఎన్నెన్ని మాటలు అనేవారో అని ఒకరికొకరు చెప్పుకున్నారట. మరి మున్ముంథు ఎన్నెన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తాయో..? ఇంకెన్ని ట్విస్ట్‌లు వర్మ ఇస్తారో వేచి చూడాల్సిందే.