Advertisementt

‘మిస్టర్ అండ్ మిస్’ ఫస్ట్ లుక్ విడుదల

Wed 30th Oct 2019 12:31 PM
mister and miss,movie,details  ‘మిస్టర్ అండ్ మిస్’ ఫస్ట్ లుక్ విడుదల
Mister and Miss Movie First Look Released ‘మిస్టర్ అండ్ మిస్’ ఫస్ట్ లుక్ విడుదల
Advertisement
Ads by CJ

ఆకట్టుకుంటోన్న‘మిస్టర్ అండ్ మిసెస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ తెలుగు ప్రేక్షకుల టేస్ట్ లో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్టుగానే

కొత్తగా వస్తోన్న మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నారు. అలా ఇప్పుడు మిస్టర్ అండ్ మిసెస్ అంటూ ఓ సినిమా రాబోతోంది. క్రౌడ్ ఫండెడ్ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ విడుదల చేశారు. పోస్టర్ ఇన్నోవేటివ్ గా ఉందని మెచ్చుకుంటూ ఎంటైర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు మధుర శ్రీధర్. 

ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడతూ: ‘‘ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు, ముంబైకి చెందిన మోడ్రన్ యువతికి పెళ్లవుతుంది. వీరిలో ఒకరి మొబైల్ మిస్ అవుతుంది.. ఆ మొబైల్ లో ఏముంది.. మిస్ అయిన మొబైల్ వీరి జీవితాలలో ఎలాంటి మార్పులను తెచ్చింది..?  యూత్ రిలేట్ అయ్యే కంటెంట్ తో ఈ సినిమా కథనం సాగుతుంది’’ అన్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర పనులలో  ఉన్న ఈ చిత్రంలో జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటిస్తున్నారు. పూర్తిగా క్రౌడ్ ఫండెడ్ మూవీగా వస్తోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : కార్తిక్ కట్స్, పాటలు: పవన్ రాచేపల్లి, కాస్ట్యూమ్ డిజైనర్ : సహస్ర రెడ్డి, ఆర్ట్

డైరెక్టర్ : కరీష్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ సాగి, సినిమాటోగ్రఫీ : సిద్ధం మనోహర్, సంగీతం : యశ్వంత్ నాగ్, పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ పెరిచర్ల, నిర్మాణం : క్రౌడ్ ఫండెడ్, కథ, దర్శకత్వం : అశోక్ రెడ్డి.

Mister and Miss Movie First Look Released:

Mister and Miss Movie Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ