టాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్ వరకూ ఇప్పుడు ఎక్కడ చూసిన బయోపిక్.. బయోపిక్. ప్రస్తుతం ట్రెండ్ కూడా ఇదే. ఈ మధ్య టాలీవుడ్‌లో వచ్చిన బయోపిక్‌లు కొన్ని సూపర్ డూపర్ హిట్టవ్వగా.. మరికొన్ని మాత్రం అడ్రస్ లేకుండా పోయాయ్.. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం.. అసందర్భం కూడా. ఇక అసలు విషయానికొస్తే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బయోపిక్‌పై అప్పట్లో హడావుడి జరిగిన విషయం విదితమే. అంతేకాదు ఈ బయోపిక్ విషయం చిరు బ్రదర్స్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇదంతా గతం.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా నాన్న బయోపిక్‌పై చరణ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు నాన్నగారి బయోపిక్‌లో నటిస్తారా అనే ప్రశ్నకు చెర్రీ చాలా లాజిక్‌గా రియాక్ట్ అయ్యాడు. నాన్నగారి సినిమాలు రీమేక్ చేయడానికి అస్సలు సాహసించనని.. అలాంటిది ఆయన బయోపిక్‌లో చేయడమా అది అస్సలు జరగని పనని చెప్పుకొచ్చాడు. అయితే ఎందుకు చేయను అనేదానికి కొన్ని కారణాలు కూడా చెర్రీ చెప్పుకొచ్చాడు.
‘చిరు బయోపిక్ అంటే కచ్చితంగా చరణ్ ఉంటాడు. నేను నాన్న పాత్రలో నటిస్తే నా పాత్రలో ఎవరు నటిస్తారు. ఒకవేళ చేసినా నేను నాలో చెర్రీని చూసుకోవాలా లేకుంటే నాన్నలా ఉండాలా..? అసలు చెర్రీతో సీన్ ఉన్నప్పుడు నన్ను నేను ఎలా చూస్కోవాలి..? ఇదంతా చాలా కన్ఫూజింగ్‌గా అనిపించే కాన్సెస్ట్. అందుకే నేను బయోపిక్‌లో నటించడం సరైన నిర్ణయం కాదని అనుకుంటున్నాను’ అని చెర్రీ తన మనసులోని మాటను చెప్పేశాడు. కాగా ఇప్పటికే చెర్రీ కాదంటే తాను బయోపిక్‌లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూ వేదికగా ప్రకటించిన విషయం విదితమే. అంటే వరుణ్‌కు లైన్ క్లియర్ అయినట్లే అన్న మాట. మరి ఈ బయోపిక్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.