పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తాడా? రాడా? అనేది పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా ఎలా ఉండబోతుంది అనే దానిమీద సోషల్ మీడియాలో రోజుకో న్యూస్ ప్రచారంలోకొస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలతో బిజీగా వున్నాడు. కానీ మరోపక్క సినిమా కథలు కూడా వింటున్నాడనే టాక్ మాత్రం భీభత్సంగా ప్రచారం అవుతుంది. హీరోయిజానికి దూరంగా వైవిధ్యభరితమైన కథలు కోసం పవన్ కళ్యాణ్ వెయిట్ చేస్తున్నాడంటున్నారు. అయితే బాలీవుడ్ హిట్ ఫిల్మ్ పింక్ రీమేక్ అయినా, క్రిష్ కాంబోలో అయినా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఫిల్మ్ పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా బలంగా వార్తలొస్తున్నాయి.
పింక్ రీమేక్ కథ అందరికీ తెలుసుకానీ.. ఒకవేళ క్రిష్ గనక పవన్‌తో సినిమా చేస్తే అదెలా ఉండబోతుంది, కథ కొత్తగా వైవిధ్యంగా ఉండాలంటున్న పవన్.. క్రిష్‌తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే విషయంపై ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం లోకొచ్చింది. క్రిష్ ఎప్పుడూ పౌరాణిక, జానపద కథలకు ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. ఇక క్రిష్ సామాజికాంశాల మీద కథలు రాస్తుంటాడు. మరి పవన్‌తో పౌరాణిక, సామాజిక, జానపద కథలలో ఎలాంటి కథను క్రిష్ ఎంచుకుంటాడనే దానిమీద ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.
అయితే క్రిష్, పవన్ కళ్యాణ్ కోసం ఓ జానపద కథని ఎంచుకున్నాడని... చారిత్రక అంశాలతో 100 ఏళ్ళ కాలంనాటి ఓ నిజ జీవిత కథ ఆధారంగా.. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా క్రిష్ కథ రాసుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. మరి క్రిష్ అయితే పవన్ కోసం రెడీ అవుతున్నాడు.. కానీ పవన్ మాత్రం ఎప్పుడు రెడీ అవుతాడో? అనేది ఎవరికీ అర్ధం కానీ విషయం.