Advertisementt

పూజా హెగ్డే లిస్ట్‌లో మరో ఫ్లాప్ మూవీ!

Tue 29th Oct 2019 07:15 PM
pooja hegde,housefull 4,flop,heroine,bollywood,unlucky  పూజా హెగ్డే లిస్ట్‌లో మరో ఫ్లాప్ మూవీ!
One More Flop in Pooja Hegde list పూజా హెగ్డే లిస్ట్‌లో మరో ఫ్లాప్ మూవీ!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా చెలరేగిపోతున్న పూజా హెగ్డే... ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాల్తో టాప్ లేపుతుంది. నిర్మాతలు కూడా పూజా హెగ్డే డిమాండ్‌ని బట్టే పారితోషకం సమర్పిస్తున్నారు. టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా మెరిసిపోతున్న పూజా హెగ్డేకి బాలీవుడ్ మాత్రం కలిసి రావడం లేదు. బాలీవుడ్‌లో అమ్మడు నటించిన సినిమాలన్నీ ఢమాల్ అంటున్నాయి. తెలుగులో డీజే‌కి ముందు హృతిక్ రోషన్‌తో కలిసి చేసిన ‘మొహంజదారో’ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక ఇక్కడ డీజే తో అమ్మడు సుడి తిరిగి తెలుగులో టాప్ హీరోయిన్ అయ్యింది.

తెలుగు సినిమాల్తో బిజీ అయినా.. బాలీవుడ్ మీద ఓ కన్నేసి ఉంచుతున్న పూజా హెగ్డేకి అక్కడ మరోసారి గట్టి షాక్ తగిలింది. భారీ తారాగణంతో తెరకెక్కిన హౌస్ ఫుల్ 4 మొన్న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ బేస్ మీద తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే వన్ అఫ్ ద హీరోయిన్. అయితే సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ... డివైడ్ టాక్ వలన సినిమాకి కలెక్షన్స్ పడిపోవడంతో.. ఈ సినిమా కూడా పూజా లిస్ట్‌లో ప్లాప్ మూవీగానే కౌంట్ పడింది. వెర్రి కామెడీతో సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అయితే సినిమాకి గనక పాజిటివ్ టాక్ వస్తే.. 300 కోట్ల క్లబ్బులో నిలిచేదని, బ్యాడ్ టాక్ వలన భారీ డిజాస్టర్ అవ్వక తప్పదని.. ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి మొహంజదారో, హౌస్ ఫుల్ 4 డిజాస్టర్స్ తో పూజ హెగ్డే కి బాలీవుడ్ కలిసి రాలేదనే చెప్పాలి. 

One More Flop in Pooja Hegde list:

Housefull 4 flop in Pooja Hegde List

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ