మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా భారత సినీ ప్రముఖులకు విందు ఇచ్చిన ప్రధాని మోడీ దక్షిణాది ప్రముఖుల్ని మాత్రం మర్చిపోయారు. దీనిపై మన సౌత్ నుండి చాలామంది అసంతృప్తి వ్యక్తం చేసారు. కానీ ఎవరు నోరు మెదిపే ధైర్యం మాత్రం చేయలేదు. ఒక్క రామ్ చరణ్ భార్య ఉపాసన తప్ప. సౌత్ నుండి ఈమె ఒక్కటే చాలా డేర్‌గా మోడీ వివక్ష చూపిస్తున్నారని.. సున్నితంగానే తన ట్వీట్‌లో తెలిపింది. ఈమె తరువాత తమిళ నటి ఖుష్బూ కూడా మోడీ తీరుపై మరింత ఘాటుగా స్పందించారు.
సౌత్ నుండి స్టార్స్‌ని ఇన్వైట్ చేయకపోవడంతో ఉపాసన హర్ట్ అయ్యి ఈ ట్వీట్ వెంటనే చేసింది. కానీ తనకు సొంత ఇంటిలోనే సపోర్ట్ లభించినట్లుగా లేదు. ఈ ట్వీట్‌పై తన భర్త రామ్ చరణ్ అంత సంతృప్తిగా లేరని.. మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో చెప్పకనే చెప్పారు. ఈ ట్వీట్ ఉపాసన తనను అడగకుండానే పెట్టిందని.. పెట్టిన తరువాత తనను ఎందుకు అడగలేదు పెట్టేముందు అని అడిగితే.. అడిగితే పెట్టనిచ్చేవాళ్ళు కాదని అందుకే చెప్పకుండా పెట్టేశానని ఉపాసన చెప్పినట్లు.. రామ్‌చరణ్ మీడియాకు చెప్పారు. అందులో.. మోడీని ఎక్కడా విమర్శించలేదని.. కవర్ చేసుకున్నారు రామ్ చరణ్. మోడీని విమర్శించారో.. లేదో..ఆ ట్వీట్‌ను అర్థం చేసుకున్నవారికి తెలుస్తుంది. ఉపాసన ముఖ్యంగా తన మామగారైన చిరంజీవిలాంటి లెజెండ్‌ను… ఆ విందుకు ఆహ్వానించకపోవడంతో అలా ట్వీట్ చేసి ఉంటదని చెబుతున్నారు.