Advertisementt

ఒక్క కట్ లేకుండా ‘మీకు మాత్రమే చెప్తా’ సెన్సార్!

Tue 29th Oct 2019 01:35 PM
meeku maathrame cheptha,censor details,vijay deverakonda,meeku maathrame cheptha movie,ready to release  ఒక్క కట్ లేకుండా ‘మీకు మాత్రమే చెప్తా’ సెన్సార్!
Meeku Maathrame Cheptha Censor Completed ఒక్క కట్ లేకుండా ‘మీకు మాత్రమే చెప్తా’ సెన్సార్!
Advertisement
Ads by CJ

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మీకు మాత్రమే చెప్తా’, నవంబర్ 1న గ్రాండ్ రిలీజ్

విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ ‘కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్’ పతాకంపై రూపొందిన సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ మూవీకి ఎలాంటి కట్స్ లేకుండా యుబైఏ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెన్సార్ సభ్యులు ‘మీకు మాత్రమే చెప్తా’ టీంను అభినందించారు. న్యూ ఏజ్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మీకు మాత్రమే చెప్తా’కు రిలీజ్‌కు ముందు పరిశ్రమలోనూ, ప్రేక్షకులలోనూ అటెన్షన్‌ని క్రియేట్ చేసింది. టీజర్, ట్రైలర్‌తో పాటు విజయ్ దేవరకొండ చేసిన ప్రోమోషనల్ వీడియో సాంగ్ ‘నువ్వే హీరో’కు మంచి రెస్సాన్స్ అందుతుంది.

ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు నుండి మంచి రెస్సాన్స్ వచ్చింది. సినిమా నిర్మాణంలో అడుగు పెట్టిన మాకు మొదటి సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’ చాలా స్పెషల్‌గా నిలుస్తుంది. కొత్త తరహా ఆలోచనలను ప్రోత్సహించేందుకు ‘కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్‌టైన్మెంట్’ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందన్న నమ్మకం మాకు ఉంది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ‘మీకు మాత్రమే చెప్తా’ నిలుస్తుంది’’ అన్నారు.

నవంబర్ 1న రిలీజ్ అవుతున్న ‘‘మీకు మాత్రమే చెప్తా’’లో తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్‌తో పాటు అభినవ్ గౌతమ్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

సినిమాటోగ్రఫీ: మదన్ గుణదేవా, 

సంగీతం: శివకుమార్,

ఆర్ట్ డైరెక్టర్: రాజ్ కుమార్,

కో డైరెక్టర్: అర్జున్ కృష్ణ,

పిఆర్వో: జి.ఎస్.కె మీడియా,

లైన్ ప్రొడ్యూసర్: విజయ్ మట్టపల్లి,

ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనురాగ్ పర్వతినేని,

నిర్మాతలు: విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ.

రచన- దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్.

Meeku Maathrame Cheptha Censor Completed:

Meeku Maathrame Cheptha Ready to Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ