Advertisementt

హీరో రామ్ నెక్స్ట్ సినిమా టైటిల్ ఫిక్స్!

Tue 29th Oct 2019 11:42 AM
hero ram,red,next movie,title  హీరో రామ్ నెక్స్ట్ సినిమా టైటిల్ ఫిక్స్!
Hero Ram Next Movie Title Fixed హీరో రామ్ నెక్స్ట్ సినిమా టైటిల్ ఫిక్స్!
Advertisement
Ads by CJ

రామ్‌ హీరోగా తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ చిత్రం ‘రెడ్‌’

సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న చిత్రం ఖరారైంది. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘రెడ్‌’ అనే టైటిల్‌ ప్రకటించారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ చిత్రం టైటిల్‌ని, ఇందులో హీరో రామ్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిషోర్‌ మాట్లాడుతూ... ‘‘ఇప్పటి వరకూ రామ్‌ చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ఉంటుంది. రామ్‌ - తిరుమల కిషోర్‌ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ విజయాల తర్వాత వాళ్లిద్దరి కాంబినేషన్‌లో మళ్లీ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మా సంస్థలో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పనిచేయడం ఇదే తొలిసారి. నవంబర్‌ 16 నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: కృష్ణ పోతినేని, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్ : పీటర్ హెయిన్స్ , ఎడిటింగ్‌: జునైద్‌.

Hero Ram Next Movie Title Fixed:

RED is the Hero Ram Next Movie Title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ