నితిన్,రష్మిక మండన, ‘భీష్మ’ తొలి ప్రచార చిత్రాలు విడుదల
నితిన్, రష్మిక మండన, వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాలను దీపావళి పర్వదినాన విడుదలచేశారు. నితిన్, రష్మికల రొమాంటిక్ టచ్ తో కూడిన ప్రచార చిత్రం ఒకటి ఐతే, మరొకటి నితిన్ పోరాట సన్నివేశంతో కూడినది. ఈ ప్రచార చిత్రాలకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.
ప్రస్తుతం చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నా యని నిర్మాత సూర్యదేవర నాగ వంశి తెలిపారు.
చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ... ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాలను దీపావళి పర్వదినాన విడుదల చేయటం జరిగింది. వీటికి ప్రేక్షకాభిమానుల నుంచి విశేషమైన స్పందన లభించింది. చిత్ర కదా, కధనాలు, సన్నివేశాలు, సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.
నటీనటులు:
నితిన్, రష్మిక మండన, నరేష్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, వెన్నెల కిషోర్, అనంత నాగ్, శుభలేఖ సుధాకర్, జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, ప్రవీణ తదితరులు నటిస్తున్నారు.
మ్యూజిక్: మహతి స్వర సాగర్ , డి.ఓ.పి: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్),
సమర్పణ: పి.డి .వి. ప్రసాద్ ,
ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి ,
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల.