వచ్చే సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి మహేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ కాగా, మరొకటి అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అల వైకుంఠపురములో’. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి ఒకే రోజు రిలీజ్ కావడం విశేషం. దాంతో రెండు సినిమాల మధ్య పోటీ విపరీతంగా ఉండడంతో ఇప్పటి నుండే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు.
దీపావళి సందర్భంగా శనివారం ‘అల వైకుంఠపురములో సినిమా నుండి రాములో రాముల పాట వస్తే... ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి ఫస్ట్ లుక్‌ను మరియు మహేష్ బాబు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ముఖ్యంగా విజయశాంతి భారతి లుక్ సరిలేరు నీకెవ్వరు సినిమా స్థాయిని పెంచేస్తోంది. అలానే ఆదివారం రష్మిక ఫోటోని కూడా రిలీజ్ చేసి సినిమాపై మరింతగా అంచనాలు పెంచేశారు.
‘అల వైకుంఠపురములో’ని రాములో రాముల పాట కూడా సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంది. శనివారం రిలీజ్ అయిన ఈ సాంగ్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తోంది. ఇలా ఈ రెండు సినిమాలు ఇప్పటి నుండే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ పోటీ పడుతున్నాయి. మరి ఈ రేస్‌లో ఎవరు విన్ అవుతారో చూడాలి?