Advertisementt

చిరుతో చరణ్.. వార్తలకే పరిమితం..!

Mon 28th Oct 2019 12:55 PM
chiranjeevi,ram charan,lucifer,koratala siva,combo  చిరుతో చరణ్.. వార్తలకే పరిమితం..!
No charan in mega star chiru next films చిరుతో చరణ్.. వార్తలకే పరిమితం..!
Advertisement
Ads by CJ

సైరా నరసింహారెడ్డి సినిమాలో తండ్రి చిరుతో చరణ్ కూడా నటిస్తాడని అనుకున్నారు. కానీ నిర్మాత అయిన చరణ్ ఆ సినిమాలో నటించలేదు. కానీ.. చిరు - కొరటాల మూవీలో చరణ్ యంగ్ చిరుగా నటించబోతున్నాడని, కొరటాల ప్రత్యేకంగా చరణ్ పాత్ర రాసినట్టుగా తెగ ప్రచారం జరగడమే కాదు.. చిరంజీవి రీమేక్ చెయ్యబోయే మలయాళ లూసీఫర్‌లోను చిరుతో చరణ్ నటిస్తాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే RRR సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న రామ్ చరణ్ తండ్రి చిరుతో ఇప్పట్లో నటించే అవకాశాలు లేనట్లుగా తెలుస్తుంది. కొరటాల శివ సినిమాలో అసలు చరణ్ రోల్ లేదని చెబుతున్నారు.


అంతేకాకుండా దర్శకుడు సుకుమార్, చిరంజీవితో లూసీఫర్ రీమేక్ చెయ్యబోతున్నాడు అంటూ వార్తాలు కూడా వస్తున్నాయి. అయితే సుకుమార్.. చిరంజీవి లూసీఫర్ రీమేక్ కోసం ప్రయత్నాలు జరపడం, చిరుతో ఆ సినిమాలో చరణ్ నటింప జేస్తే బావుంటుందని చెప్పడం నిజంగానే జరిగాయట. అయితే చిరు మాత్రం లూసీఫర్ రీమేక్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసి చెయ్యనట్లు చేసినా.. చరణ్‌తో మాత్రం ఆ సినిమాలో నటించను అని... మరో యంగ్ హీరో ఆ సినిమాలో నటిస్తాడని ఫీలర్ మాత్రం వదలడంతో... చిరుతో చరణ్ ఇప్పట్లో నటించే అవకాశాలు లేవని మెగా ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అవ్వొచ్చు.

No charan in mega star chiru next films:

Ram charan not acted in chiru films 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ