Advertisementt

సెట్స్‌లో ‘రూలర్’ ప్రకాష్ రాజా..!

Mon 28th Oct 2019 07:28 AM
ruler,prakash raj,problems,bhumika,balakrishna  సెట్స్‌లో ‘రూలర్’ ప్రకాష్ రాజా..!
Prakash Raj Creates problems to ruler సెట్స్‌లో ‘రూలర్’ ప్రకాష్ రాజా..!
Advertisement
Ads by CJ

ప్రకాష్ రాజ్ నటన అంటే ఎంతమందికి ఇష్టమో.. ఆయనకు కోపమొస్తే.. అంతే నష్టం జరుగుతుంది. విలన్‌గా, తండ్రిగా, మామగా, పొలిటీషియన్‌గా ఇలా ఏ పాత్రలోనైనా జీవించగలిగే నటుల్లో ప్రకాష్ రాజ్ ముందు వరసలో ఉంటారు. కానీ కొన్నిసార్లు ప్రకాష్ రాజ్‌కి కోపమొచ్చినప్పుడు నిర్మాతలు నష్టపోతే.... మరికొన్నిసార్లు ప్రకాష్ రాజే నష్టపోయేవాడు. విలక్షణ నటుడిగా పేరున్నప్పటికీ.... ప్రకాష్ రాజ్ కోపానికి మాత్రం హద్దులు ఉండవు. అందుకే చాలామంది దర్శకనిర్మాతలు ప్రకాష్ రాజ్‌ని లైట్ తీసుకుని, సత్యరాజ్, సముద్రఖని వంటి కేరెక్టర్ ఆర్టిస్ట్‌ల వెంట పడుతున్నారు. కొన్నిసార్లు తన తప్పు తెలుసుకుని ప్రకాష్ రాజ్ సర్దుకుపోతే.. కొన్నిసార్లు మాత్రం దర్శకనిర్మాతలే ప్రకాష్ రాజ్‌ని సినిమాల నుండి తీసేసిన సందర్భాలు ఉన్నాయి. షూటింగ్ స్పాట్‌లో గొడవలు పడడం ప్రకాష్ రాజ్ విషయంలో కొత్తేమీకాదు. ఈమధ్యనే రామ్ హీరోగా తెరకెక్కిన హలో గురు ప్రేమకోసమే సినిమా సెట్స్ లో హీరోయిన్ అనుపమకి, ప్రకాష్ రాజ్‌కి మధ్యన గొడవైనట్లుగా ఓ వార్త చక్కర్లు కొట్టింది.


తాజాగా బాలకృష్ణ ‘రూలర్’ సినిమా సెట్స్ లోను ప్రకాష్ రాజ్ ఏదో రచ్చ చేసాడనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బాలకృష్ణ హీరోగా కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రూలర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రకాష్ రాజ్.. షూటింగ్ సమయంలో బాలయ్య - హీరోయిన్ భూమికల మీద కొన్ని సన్నివేశాల షూట్ జరుగుతుండగా.... భూమిక తన పాత్రని సరిగా చేయకపోవడంతో ఆమెపై ప్రకాష్ రాజ్ గట్టిగా అరిచినట్టు సోషల్ మీడియా టాక్. అయితే అలా అరవడంతో ఉలిక్కిపడిన కెమెరామెన్ ప్రసాద్.. షూటింగ్ స్పాట్ ‘నీ ఇల్లు కాదు’ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ బిహేవ్ చేయడానికి అని చెప్పడంతో.. ప్రకాష్ రాజ్ ‘రూలర్’ సెట్స్ నుండి కోపంగా వెళ్ళిపోయాడట. అయితే బాలయ్య కానీ ఇతర యూనిట్ సభ్యులెవరూ ప్రకాష్ రాజ్‌ని పట్టించుకోకుండా ఉండిపోవడంతో.. కాస్త కూల్ అయిన ప్రకాష్ రాజ్ మళ్లీ యధావిధిగా షూటింగ్‌కి హాజరైనట్టుగా సమాచారం.

Prakash Raj Creates problems to ruler:

Prakash raj fires on bhumika at ruler sets

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ