Advertisementt

రానాను లాక్కొచ్చి మరీ బాలీవుడ్ బ్యూటీ ఫొటోలు!

Sun 27th Oct 2019 09:40 PM
bollywood beauty deepika,deepika padukone,rana daggubati,bollywood  రానాను లాక్కొచ్చి మరీ బాలీవుడ్ బ్యూటీ ఫొటోలు!
Bollywood beauty plays fun with Rana Daggubati! రానాను లాక్కొచ్చి మరీ బాలీవుడ్ బ్యూటీ ఫొటోలు!
Advertisement
Ads by CJ

ఇదేంటి టైటిల్ చూడగానే కాస్త ఎక్కువగా అనిపించింది కదూ.. అవును మీరు వింటున్నది నిజమే. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన దగ్గుబాటి రానాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్‌గా ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా కొందరు సెలబ్రిటీలే రానా అంటే అమితంగా ఇష్టపడుతుంటారు.. వారిలో ఫ్యాన్స్‌ కూడా ఉన్నారు. ఇక బాలీవుడ్‌లో రానాకు ఉన్న పరిచయాలు, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

ఇక అసలు విషయానికొస్తే.. ముంబైలో ఓ అవార్డ్ ఫంక్షన్‌కు రానా హాజరయ్యాడు. ఈ వేడుకకు బాలీవుడ్ బ్యూటీ, ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌లో ఒకరైన దీపికా పదుకుణె కూడా విచ్చేసింది. ఫంక్షన్ పూర్తయ్యాక ఆమెతో ఫొటోలు దిగడానికి అభిమానులు, పలువురు ఆర్టిస్ట్‌లు క్యూ కట్టారు. అలా ఫొటోలు దిగుతున్న టైమ్‌లో రానా అటు వైపుగా వెళ్తున్నాడు.. అంతే.. ఫొటోకు ఫోజులు ఆపి మరీ రానా దగ్గరికెళ్లింది దీపిక. రానా సిగ్గుపడుతూ పర్లేదు మీరు కానిచ్చండి అన్నప్పటికీ ఆమె విన్లేదు.. రానా రాకపోయే సరికి లాక్కొని వచ్చి మరీ ఫొటోలు దిగింది. మొదట అభిమానులతో కలిసి రానా, దీపిక గ్రూప్ ఫొటోకు పోజులిచ్చి అనంతరం ఇద్దరూ ప్రత్యేకంగా ఫొటోలు దిగారు.

ఇలా కాసేపు.. రానాతో దీపిక పదుకొనే గిల్లికజ్జాలు ఆడుకుంది. అంతేకాదండోయ్.. ఫోటోలకు పోజులిస్తున్నప్పుడు రానా ఏదో జోక్ చేయగా.. ఆయన పొట్టలో గిల్లి మరీ డ్యాన్స్ చేసే ప్రయత్నం చేసింది దీపికా. ఈ పోజులు అయిపోయాక దీపిక డ్రెస్ ఎక్కడ తొక్కుతానో అని.. తిన్నగా ఆమె దూరంగా డ్రెస్ వైపు చూస్తూ నవ్వుకుంటూ నడిచి స్టేజ్ దిగాడు. మొత్తానికి చూస్తే.. ఈ ఫొటోలకు పోజులివ్వడాన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య ఎంత క్లోజ్‌నెస్ ఉందో అర్థం చేసుకోవచ్చు మరి.

Bollywood beauty plays fun with Rana Daggubati!:

Bollywood beauty plays fun with Rana Daggubati!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ