Advertisementt

బిగ్‌బాస్ నుంచి ఇవాళ ఔటయ్యేది ఎవరంటే..!

Sun 27th Oct 2019 07:55 PM
elimination day,biggboss,telugu biggboss,sivajyothy,teenmar savithri  బిగ్‌బాస్ నుంచి ఇవాళ ఔటయ్యేది ఎవరంటే..!
Who Eliminated today from Bigg Boss.. Details Here! బిగ్‌బాస్ నుంచి ఇవాళ ఔటయ్యేది ఎవరంటే..!
Advertisement
Ads by CJ

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-3 ముగింపు దశకు చేరుకుంది. ఇవాళ అనగా ఆదివారం ఎపిసోడ్‌తో ఈ షో 14 వారాలు పూర్తి చేసుకోనుంది. అయితే ఆదివారం కావడంతో బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరు ఔటవుతారన్న దానిపై ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో చిన్నపాటి లీకులు బయటికొచ్చేశాయ్.. శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి ఇవాళ హౌస్‌ నుంచి ఎలిమినేట్ అవుతారన్నదే ఆ లీకుల సారాంశం.

వాస్తవానికి ఎలిమినేషన్‌లో రాహుల్ మినహా ఇంట్లోని మిగతా వారంతా ఉన్న విషయం విదితమే. వీరిలో ఒకరు బయటకు వెళ్లడమైతే పక్కా. సోషల్ మీడియా వేదికగా ప్రతీవారం లాగే పెద్ద ఎత్తున లీకులు వస్తున్నాయి. శివజ్యోతి ఇప్పటి వరకూ షోలో సెంటిమెంట్స్, ఎమోషన్స్ పండిస్తూ బాగానే నెట్టుకుంటూనే వచ్చింది. అయితే శివజ్యోతిని ఎలిమినేట్ చేస్తారని తెలుసుకున్న తీన్మార్ అభిమానులు, ఫ్రెండ్స్‌ కాసింత అసంతృప్తికి లోనవుతున్నారట. మరి లీక్స్‌లో ఏ మేరకు నిజముందో..? శివజ్యోతి ఎలిమినేట్ అవుతుందో? లేదో? అనేది తెలియాలంటే ఆదివారం రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ చూసి తీరాల్సిందే మరి.

కాగా.. ఈ ఎలిమినేషన్ పూర్తయితే బిగ్‌బాస్ చివరి వారానికి వెళ్లనుంది. అయితే.. రాహుల్, బాబా భాస్కర్ ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోగా ఇక శ్రీముఖి, శివజ్యోతి, వరుణ్, అలీ రెజా కూడా రేసులో ఉన్నారు. వీరిలో టాప్-3లో శివజ్యోతి, శ్రీముఖి, వరుణ్ ఉండవచ్చని ప్రేక్షకులు, బిగ్‌బాస్ ప్రియులు అంచనాలు వేస్తున్నారు. అయితే.. ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్లు... బిగ్‌బాస్ చేతిలో ఉన్న స్కిప్ట్‌లో ఏముందో ఎవరికి ఎరుక.

Who Eliminated today from Bigg Boss.. Details Here!:

Who Eliminated today from Bigg Boss.. Details Here!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ