బి.మధు నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకుడిగా మాస్ మహారాజా రవితేజ 66వ చిత్రం
మాస్ మహారాజా రవితేజ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధమవుతుంది. డాన్ శీను, బలుపు వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది. రవితేజ 66వ చిత్రమిది.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండేలా డైరెక్టర్ గోపీచంద్ మలినేని పవర్‌ఫుల్ కథను సిద్ధం చేస్తున్నారు. వీరిద్దరి హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. బి.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్‌లో సినిమాను గ్రాండ్‌గా ప్రారంభిస్తామని, అలాగే సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.