Advertisementt

మహేష్ బాబు సినిమాకి మళ్లీ ఇద్దరు నిర్మాతలు?

Sat 26th Oct 2019 09:14 PM
two producers,superstar mahesh movie
,pvp,mahesh babu  మహేష్ బాబు సినిమాకి మళ్లీ ఇద్దరు నిర్మాతలు?
Again Two Producers To Superstar Mahesh Movie మహేష్ బాబు సినిమాకి మళ్లీ ఇద్దరు నిర్మాతలు?
Advertisement
Ads by CJ

మహేష్ బాబు- నిర్మాత పీవీపీకి మధ్య ఒక డీల్ కుదిరింది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమాకు ముందు మహేష్ తన బ్యానర్ లో రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేసుకునేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. అలానే డైరెక్టర్ వంశీ పైడిపల్లితో అటువంటి అగ్రిమెంట్ చేసుకున్నారు. కాకపోతే బ్రహ్మోత్సవం దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో ఆ వ్యవహారాలన్నీ మారిపోయాయి.

మహేష్ పివిపి బ్యానర్ లో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. అలానే డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా పివిపితో వర్క్ చేయడానికి ఇష్టపడకుండా, దిల్ రాజు దగ్గరకు వెళ్లడం కూడా ఓ కారణం. దాంతో కోర్ట్ కి వెళ్లిన పివిపి కి మహర్షి సినిమాలో ఆన్ అఫ్ ది ప్రొడ్యూసర్ గా ఛాన్స్ వచ్చింది. కానీ మహర్షి వల్ల పివిపి కి మిగిలింది ఏమి లేదు. పివిపికి నష్టమే తప్ప పైసా లాభం లేదు.

దాంతో ఇప్పుడు ఆయనకు దిల్ రాజు నిర్మించే మహేష్ - వంశీ సినిమా కి వాటా వున్నట్లు తెలుస్తోంది. యాభైశాతం వాటా ఉన్నట్టు తెలుస్తుంది. దీని పై అధికార ప్రకటన కూడా రానుంది.

Again Two Producers To Superstar Mahesh Movie:

Again Two Producers To Superstar Mahesh Movie  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ