Advertisementt

ఆ హీరోతో రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డా!

Sat 26th Oct 2019 06:54 PM
kajal aggarwal,romance,randeep hooda,do lafzon ki kahani  ఆ హీరోతో రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డా!
Kajal Aggarwal Talks about Romance.. ఆ హీరోతో రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డా!
Advertisement
Ads by CJ

చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అనతి కాలంలోనే టాలీవుడ్‌ టాప్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. జూనియర్ హీరోలు మొదలుకుని మెగాస్టార్, సూపర్‌స్టార్, పవర్‌స్టార్ ఇలా అందరు స్టార్ హీరోల సరసన ఈ భామ నటించి మెప్పించింది. అయితే ఈ మధ్య అవకాశాలు పెద్దగా రాకపోవడంతో అటు కోలీవుడ్, బాలీవుడ్ బాట పట్టింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ‘కాల్‌ సెంటర్‌’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు 2’ చిత్రాలతో బిజీబిజీగా ఉంటోంది ఈ బ్యూటీ.

ఇక అసలు విషయానికొస్తే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. తన నట జీవితంలో ఎదుర్కోన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇప్పటివరకూ మీరు నటించిన సినిమాల్లో ఏ నటుడితో రొమాన్స్‌ చేయడానికి బాగా ఇబ్బంది పడ్డారు అనే ప్రశ్న ఎదురవ్వగా.. ఆమె కాసేపు ఆలోచయించి సమాధానమిచ్చింది. 2016లో తాను నటించిన ‘దో లఫ్జోన్‌ కే కహనీ’ చిత్రంలో అంధురాలి పాత్రలో చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది.

అంతేకాదు.. తన ప్రియుడిగా రణదీప్‌ హుడా నటించాడని చెప్పింది. ‘మా ఇద్దరి మధ్య ఉండే ప్రేమను చూపడానికి కొన్ని రొమాంటిక్ సీన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. నాకు తెలియని ఒక వ్యక్తితో అలాంటి రొమాంటిక్ సీన్స్‌లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది’ అని చందమామ బ్యూటీ చెప్పుకొచ్చింది.

Kajal Aggarwal Talks about Romance..:

Kajal Aggarwal Talks about Romance..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ