సినిమాల పబ్లిసిటీ విషయంలో విజయ్ దేవరకొండ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. తను హీరోగా నటించిన సినిమాల పబ్లిసిటి విషయంలో నిర్మాతలకన్నా ఎక్కువగా విజయ్ టెంక్షన్ తీసుకుని.... సినిమాల పబ్లిసిటీ ప్రేక్షకులను రీచ్ అయ్యేలా చెయ్యడంలో అతని స్ట్రాటజీనే వేరు. డియర్ కామ్రేడ్ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ చేసిన పబ్లిసిటీ విషయంలో అందరూ.. స్టార్ హీరోలను వేలెత్తి చూపించేలా ఉంది. అయితే తానూ హీరోగా చేసే సినిమాల పబ్లిసిటీ విషయంలో అంత పర్ఫెక్ట్ గా ఉండే విజయ్ దేవరకొండ తాను నిర్మించిన సినిమా పబ్లసిటీ విషయంలో వీక్ గా ఉండడం మాత్రం అందరిని ఆశ్చర్యంలో పడేస్తుంది.
తన మొదటి సినిమా పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా విజయ్ దేవరకొండ నిర్మాతగా తెరకెక్కిన మీకు మాత్రమే చెప్తా సినిమా నవంబర్ 1 న విడుదలకు సిద్దమవుతుంది. అయితే టైటిల్ రివీల్ చేసినప్పుడు, టీజర్ లాంచ్ ని మహేష్ తో చేయించినప్పుడు విజయ్ దేవరకొండ తన సినిమాని ప్రమోట్ చేసే విషయం అందరికి నచ్చింది. కానీ సినిమా విడుదల దగ్గర పడుతున్నవేళ మీకు మాత్రమే చెప్తా సినిమా ప్రమోషన్స్ ని విజయ్ దేవరకొండ పట్టించుకోవడం మానేశాడని టాక్ మొదలైంది. అయితే ఈ సినిమాకి విజయ్ దేవరకొండ నిర్మాత అయినప్పటికీ సినిమాపై బజ్ రావడం లేదని.. కారణం హీరోగా తరుణ్ భాస్కర్ ని ప్రేక్షకులు ఒప్పుకుంటారో... లేదో.. అనే అనుమానంతో సినిమాపై క్రేజ్ పెరగడం లేదని అంటున్నారు.
టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ.. ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ.. సినిమాపై మాత్రం అంచనాలు పెరగడం లేదు. అందుకే విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాని లైట్ తీసుకున్నాడనిపిస్తుంది. ఇక ఈ సినిమాని ఏషియన్ పిక్చర్స్ దాదాపు 2.5 కోట్లకు కొనుగోలు చేసారు. వెనుక విజయ్ దేవరకొండ ఉన్నాడు.. సినిమాపై క్రేజ్ ఉంటుంది అని వారంత పెట్టుబడి పెట్టి సినిమాని కొంటే.. ఇప్పుడు విజయ్ ప్రమోషన్స్ ఆపెయ్యడంతో వారు కంగారు పడుతున్నారట.