టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు ఉండే రేంజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. రోజురోజుకూ ఈయనకు అభిమానులు పెరుగుతుంటారే తప్ప తరగరు. అందుకే ఈయన అన్ని సినిమాలు తీయగలుతున్నాడు.. యాడ్ ఏజెన్సీ వాళ్లు పిలిచి మరీ కోట్లు ఇస్తున్నారు. ఒకానొక సందర్భంలో తన సినిమాలను వరుసగా ప్లాప్‌లు అవ్వడంతో అచ్చంగా యాడ్స్‌లో నటించే గట్టిగా వెనకేసుకున్నాడు ప్రిన్స్.
అయితే తాజాగా తన ఫ్యామిలీతో కలిసి సూర్య డెవలపర్స్‌కు ఓ యాడ్ చేశాడు. ఇలా ఫ్యామిలీతో కలిసి యాడ్ చేయడం ఇదే మొదటిసారి. కాగా.. ఈ ప్రకటనలో మహేశ్‌తో పాటు భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార కూడా ఉన్నారు. ఇంతవరకూ అంతా ఓకే గానీ ఈ యాడ్‌కు మహేశ్ ‘ఫ్యామిలీ ప్యాకేజీ’గా ఎంత పుచ్చుకున్నారు..? అనేది ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశమైంది. అయితే ఒకట్రెండు కాదు ఏకంగా రూ.6 కోట్లు ఈ ప్యామిలీ ప్రకటనకు పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే మహేశ్ ఒక్కడికే రూ. 3 కోట్లు.. మిగిలిన ముగ్గురికీ ఒక్కొక్కరికీ కోటి రూపాయిలు చొప్పున సూర్య డెవలర్స్ యాజమన్యం ఇచ్చుకుందున్న మాట.
ఈ యాడ్‌లో నటించిన తర్వాత తన అభిమానులు, సినీ ప్రియులతో ట్విట్టర్ వేదికగా మహేశ్ ఈ విషయాన్ని పంచుకున్నాడు. ‘మా ఫ్యామిలీ అంతా కలిసి తొలిసారిగా నటించాం. షూటింగ్ ఎంతో ఆనందంగా సాగిపోయింది. అందరినీ కలుపుతూ సాయి సూర్యా డెవలపర్స్ ఈ యాడ్‌ను నిర్మించింది. అందుకు కృతజ్ఞతలు’ అని ట్విట్టర్‌లో సూపర్‌స్టార్ రాసుకొచ్చాడు.