Advertisementt

200 మంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో సాంగ్!

Sat 26th Oct 2019 12:40 PM
vijay deverakonda,fans,200,meeku maathrame cheptha,promotional,song,released  200 మంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో సాంగ్!
Meeku Maathrame Cheptha Promotional Song Released 200 మంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో సాంగ్!
Advertisement
Ads by CJ

200 మంది విజయ్ దేవరకొండ ఫాన్స్ చేతుల మీదుగా మీకు మాత్రమే చెప్తా ‘నువ్వే హీరో’ ప్రోమోషనల్ మ్యూజిక్ వీడియో సాంగ్ రిలీజ్

విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ ‘కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్’ పతాకంపై రూపొందిన సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’ . ఈ మూవీ మ్యూజిక్ వీడియో ‘నువ్వే హీరో’ సాంగ్ లాంచ్ విజయ్ ఫ్యాన్స్ చేతుల మీదుగా జరిగింది. ఫ్యాన్స్ ని ఫ్యామిలీగా ట్రీట్  చేసే హీరో విజయ్ దేవరకొండ తాను ప్రొడ్యూస్ చేస్తున్న మొదటి మూవీ మ్యూజిక్ వీడియా ‘నువ్వే హీరో’ ని ఫ్యాన్స్ తో లాంచ్ చేయించారు. ఎ ఎమ్ బి మాల్ లో జరిగిన ఈ ఈవెంట్ విజయ్ ఫ్యాన్స్ సందడి చేశారు. రెండు వందల మంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ప్రత్యేక అతిధులుగా మారిన ఈ మ్యూజిక్ వీడియో లాంచ్ లో నవాబ్ రాప్ గ్యాంగ్ పాడిన పాట హైలెట్ గా మారింది. వారితో కలిసి విజయ్ స్టెప్స్ వేశారు.

ఈ సందర్భంగా : విజయదేవరకొండ మాట్లాడుతూ : ‘‘ఈ ప్రోమోషనల్ సాంగ్ కోసం నేను చాలా కష్టపడ్డాను. మా కొరియోగ్రాఫర్ విజయ్ నాకంటే ఎక్కువ శ్రమ తీసుకున్నాడు. తరుణ్, అభినవ్ గోమటం కూడా నాతో స్టెప్స్ వేయాలి కానీ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తో కుదరలేదు. ఈ మూవీ ఆడియో రైట్స్ తీసుకున్న ఆదిత్య మ్యూజిక్ కి పెద్ద థాంక్స్ .. ఉమేష్ గుప్త గారు ఈ ఈవెంట్ కి వచ్చినందుకు థాంక్స్. కొత్త వారు అయినా ప్రయత్నానికి ఉమేష్ గారు అందించిన సహకారం మర్చిపోలేను.  శివ మంచి మ్యూజిక్ అందించాడు. తరుణ్ యాక్టింగ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అభినవ్ బాగా ఎంటర్టైన్ చేసాడు. నవంబర్ 1 న విడుదల అవుతుంది. మీకు బాగా

నచ్చుతుంది అని నమ్ముతున్నాను’’ అన్నారు.

ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా మాట్లాడుతూ : ‘‘గీతా గోవిందం, టాక్సీవాలా ఆడియో ఆదిత్య ద్వారా రిలీజ్ చేసాము. మీకు మాత్రమే చెప్తా ఆడియోని మాపై నమ్మకంతో ఇచ్చిన  ప్రొడ్యూసర్ వర్ధన్ దేవరకొండ గారికి థాంక్స్. విజయ్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ కావాలని

కోరుకుంటున్నాను.’’

దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ మాట్లాడుతూ : ‘‘ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది అని నమ్ముతున్నాను. తరుణ్ బాగా

యాక్ట్ చేసాడు, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి ఎంటర్టైనర్ తో నవంబర్ 1న మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు.

తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం  ఫన్నీ మూమెంట్స్ షేర్ చేసుకున్నారు’’ అన్నారు.

నవంబర్ 1 న రిలీజ్ అవుతున్న ‘‘మీకు మాత్రమే చెప్తా’’లో తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్ తో పాటు అభినవ్ గౌతమ్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా, సంగీతం : శివకుమార్, ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కుమార్, కో డైరెక్టర్ : అర్జున్ కృష్ణ, పిఆర్.వో : జి.ఎస్.కె మీడియా, లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ మట్టపల్లి, ఎక్సిక్యూటివ్ - ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతినేని, నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ. రచన-దర్శకత్వం : షమ్మీర్ సుల్తాన్.

Meeku Maathrame Cheptha Promotional Song Released:

200 Vijay Deverakonda Fans Released Meeku Maathrame Cheptha Promotional Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ