Advertisementt

సరిలేరు నీకెవ్వరు: అనిల్‌-దేవీశ్రీ మధ్య కొట్లాట!?

Sat 26th Oct 2019 11:56 AM
differences,anil ravipudi,devi sri prasad,sarileru neekevvaru  సరిలేరు నీకెవ్వరు: అనిల్‌-దేవీశ్రీ మధ్య కొట్లాట!?
Differences between Anil ravipudi and Devi sri prasad సరిలేరు నీకెవ్వరు: అనిల్‌-దేవీశ్రీ మధ్య కొట్లాట!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు షూటింగ్ అయిపోయింది. షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన అనీల్ ఇప్పుడంతా మ్యూజిక్‌పైనే దృష్టి సారించాడు. 2020 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్న దర్శకనిర్మాతలు త్వరత్వరగా పనులు కానిచ్చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఎలాంటి వివాదాలు బయటికి రాలేదు కానీ తాజాగా ఓ రూమర్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో కోడై కూస్తోంది.

అదేమిటంటే.. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌-అనీల్ రావిపూడి మధ్య మ్యూజిక్ విషయంలో కొట్లాట జరిగిందన్నదే ఆ రూమర్ సారాంశం. వాస్తవానికి అనీల్‌, మహేశ్‌తో కలిసి పనిచేయడం దేవీకి కొత్తేం కాదు. అనిల్ తెరకెక్కించిన ‘ఎఫ్ 2’ కు రాక్‌స్టార్ మ్యూజిక్ ప్లస్ అయ్యింది.. ఇది కూడా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంలో ఒక్కటి కావడంతో తన తదుపరి సినిమాకు ఆయన్ను ఎంచుకున్నాడు. ఇక మహేశ్ విషయానికొస్తే.. ‘1 నేనొక్కడినే’ మొదలుకొని ‘మహర్షి’ వరకు మహేష్ బాబుకు దేవీ మంచి ఆల్బమ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకే అటు అనీల్.. ఇటు మహేశ్ ఇద్దరూ రాక్‌స్టార్ వైపే మొగ్గు చూపడానికి కారణమిదే.

అయితే.. ఏరికోరి తెచ్చుకోవడంతో ఇక ఏముందిలే అని దేవీ శ్రీ.. ట్యూన్స్ విషయంలో లైట్ తీసుకుంటున్నారట. ఆ ట్యూన్స్ దేవీ శ్రీతో పాటు మహేశ్‌కు కూడా నచ్చలేదని రూమర్ గట్టిగా నడుస్తోంది. అయితే ఇంతకుమించి బెటర్‌గా ట్యూన్ కావాలని అనీల్ చెప్పాడట. దేవీ.. ఆర్మీ బ్యాక్ డ్రాప్ కదా..? అసలే మహేశ్ ఫ్యాన్స్ పరిస్థితి మీకు తెలుసు కదా..? కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి ఇవ్వండనీ పదే పదే అనీల్ చెప్పినప్పటికీ ఆయన మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదట. దీంతో దేవీ శ్రీ పట్ల అనీల్ రావిపూడి తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. తనపై ఎవరు ఎలా మాట్లాడినా టక్కున సోషల్ మీడియా ద్వారా స్పందించే అనీల్ ఈ వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Differences between Anil ravipudi and Devi sri prasad:

Differences between Anil ravipudi and Devi sri prasad  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ