శ్రీయ.. గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకించి మరీ చేయనక్కర్లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిందీ భామ. సీనియర్లు, జూనియర్ల, స్టార్‌లు ఆ పాత్ర ఈ పాత్ర అని లేకుండా ఆఖరికి వ్యభిచారి పాత్రలో కూడా నటించేసి మెప్పించింది. అయితే తెలుగులో అస్సలు అవకాశాలు రాకపోవడంతో ఈ గ్యాప్‌లో ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్‌ను పెళ్లి చేసుకుని ఎంచక్కా ఎంజాయ్ చేసేసింది. ఈ మధ్య గట్టిగానే ట్రిప్‌లు అని హడావుడి చేస్తూ సోషల్ మీడియాలో అదిరిపోయే పిక్స్ పెడుతూ కుర్రకారుకు గిలిగింతలు పెడుతోంది. అయితే సినిమాల్లో గ్యాప్ వచ్చినా.. పెళ్లయినా ఫిజిక్ మాత్రం ఈ భామ బాగానే కాపాడుకుంటూ వస్తోంది.
అయితే తాజాగా.. ఈ ముద్దుగుమ్మ చేసిన ఓ పనికి ‘పబ్లిక్‌లో ఏంటీ న్యూసెన్స్.. ఇళ్లు లేదా!?’ అంటూ సినీ ప్రియులు, నెటిజన్లు సోషల్ మీడియాలో శ్రీయపై దుమ్మెత్తిపోస్తున్నారు. పెళ్లైన తర్వాత ఫస్ట్ టైమ్ ముంబైకి భర్తతో కలిసి వచ్చిన శ్రీయ.. నిర్మాత రమేష్ తౌరానీ ఇచ్చినన పార్టీకి హాజరైంది. పార్టీ అయిపోయిన తర్వాత దంపతులిద్దరూ ఫొటోలకు పోజులిచ్చారు. ఇంతవరకూ అంతా ఓకేగానీ.. లిఫ్ట్ ఎక్కడానికి వెళుతూ భర్తకు లిప్ లాక్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యింది. అందరి ముందూ.. శ్రీయ లిప్‌లాక్ ఇవ్వడంతో పార్టీకి వచ్చిన సెలబ్రిటీలు, ఫొటోలు లీక్ అవ్వడంతో నెటిజన్లు, సినీ ప్రియులు సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు.
పబ్లిక్‌గా ముద్దులు పెట్టడమేంటి..? మీ భర్తే కదా.. మీ దగ్గరే ఉంటారు కదా..? అని కొందరు నెటిజన్లు.. ఇంట్లో చేయాల్సిన ఇలాంటి పనులు నలుగురిలో బిల్డప్ కోసం చేస్తున్నారా ఏంటి..? అని మరికొందరు.. చూడలేక చచ్చిపోతున్నాం రా బాబూ.. ఈ పాడు రొమాన్స్ అంటూ నెటిజన్లు శ్రీయపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.