టాలీవుడ్ కమెడియన్ కమ్ నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్‌కు ఇప్పుడు కేసులతో సతమతం అవుతున్నాడు. ఇప్పటి వరకూ బండ్ల నిర్మాతగా మూడు పువ్వులు.. ఆరుకాయలు అన్నట్లుగా అంతా సాఫీగానే సాగింది. అయితే.. ఏం జరిగిందో ఏమోగానీ ఇప్పుడు అన్నీ బ్యాడ్ డేసే. బడా ప్రొడ్యూసర్ పీవీపీతో ఆర్థిక వివాదాలతో మొదలైన కేసులో హైదరాబాద్ టూ కడప దాకా వెళ్లాయి. అయితే ఇవన్నీ పాత కేసులే అయినప్పటికీ సరిగ్గా ఇదే టైమ్‌లో బయటికి వస్తుండటంతో అసలేం జరుగుతోంది..? అనేది తెలియక బండ్ల తలపట్టుకుంటున్నాడట.
ఇక అసలు విషయానికొస్తే.. కడప జిల్లాలో ఓ వ్యక్తి దగ్గర కోట్లల్లో అప్పుగా తీసుకుని కొంచెం ఇచ్చి మిగిలినిది ఇవ్వలేదని పోలీసులు కేసు నమోదు చేయడం రీసెంట్‌గానే ఆయన్ను జిల్లా పోలీసులు 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. అంటే నవంబర్ 4వరకు బండ్ల.. జైలు జీవితం గడపాల్సిందే మరి.. కానీ అది జరగలేదు. ఊహించని విధంగా ఆయనకు కొన్ని గంట్లలోనే బెయిల్ వచ్చేసింది.. హౌ ఇట్స్ పాజిబుల్.!
డబ్బులు ఏ పనైనా చేస్తాయ్.. డబ్బులతో కొనలేనిదేదీ అని అనుకుంటాం కానీ కొన్ని కొన్ని సందర్బాల్లో ఆ డబ్బులు దేనికీ పనికిరావ్. అయితే బండ్లకు డబ్బులు ఏ మాత్రం కొదువలేదు. అయితే బెయిల్ వచ్చే పరిస్థితి లేదు.. ఎంత డబ్బులు పోసినా కష్టమే. ఇలాంటి సమయంలో ఓ మంత్రి రాయబారం నడపటంతో బండ్లకు బెయిల్ వచ్చిందట. ఆ మంత్రి తెలంగాణకు చెందిన వ్యక్తా.. లేకుంటే ఏపీకి చెందిన మంత్రా అనేది ఇక్కడ అసందర్భం. మంత్రితో బండ్లకు మంచి సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన సాయం కోరారని.. దీంతో మంత్రి రంగంలోకి దిగి బెయిల్ ఇప్పించారని టాక్ నడుస్తోంది. అంటే బండ్లను బయటపడేసింది మంత్రన్న మాట. ఈ ఒక్క కేసు నుంచి బయటపడేశారు సరే.. తెలుగు రాష్ట్రాలు మొదలుకుని ముంబై వరకూ కుప్పలు తెప్పలుగా కేసులున్నాయ్.. మరి ఈ కేసుల నుంచి బండ్లను ఎవరు కాపాడుతారో మరి.