‘భారతీయుడు 2’ లుక్ లీకైంది..!!

Indian 2 Movie Look leaked

స్టార్ డైరెక్టర్ శంకర్ తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తాను చేస్తున్న సినిమాకి సంబంధించి ఎక్కడా లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సెట్ నుండి ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా చాలా పకడ్భందీగా షూట్ చేస్తాడు. కానీ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాకి కూడా లీక్ బెడద తప్పలేదు.

అతను తీస్తున్న ‘భారతీయుడు 2’ నుండి ఒక ఫోటో బయటకు వచ్చి వైరల్ అవుతుంది. కీలకమైన ఆ ఫోటో ఆన్ లొకేషన్ నుంచి ఓ లుక్ లీకైపోయింది. సెల్ ఫాలెన్ నుండి ఎవరు తీసినట్టు అర్ధం అవుతుంది. కమల్ హాసన్ సేనాపతి గెటప్ లో ఓ గుర్రంపై వెళుతున్నారు. అది కూడా మార్కెట్ వీధుల్లో గుర్రంపై కూచుని ఠీవిగా స్వారీ చేస్తున్నాడు సేనాపతి. ఇందులో కమల్ 90 ఏళ్ళ వృద్దుడి పాత్రలో కనిపించనున్నాడు. మొదటి పార్ట్ లో 70 ఏళ్ళ సేనాపతిగా కనిపిస్తే ఇప్పుడు 90 ఏళ్ళ సేనాపతిగా కనిపించనున్నాడు అని ఆ ఫోటో చూస్తే అర్ధం అవుతుంది.

లీకెడ్ ఫోటోనే అలా ఉంటే ఇంకా ఒరిజినల్ ఫోటో ఎలా ఉంటుందో? అసలు కమల్ హాసన్ ముసలోడి పాత్రలో ఎలా ఉంటాడో అని ఇప్పటి నుండే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Indian 2 Movie: leaks Started

kamal haasan
indian 2
movie
look
leaked