గత కొంతకాలంగా సూర్య సినిమాలేవీ బాక్సాఫీసుని షేక్ చెయ్యలేకపోతున్నాయి. సింగం సీరీస్ హిట్ తర్వాత సూర్య మళ్ళీ అలాంటి హిట్ అందుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేసినా... అవన్నీ ప్లాప్స్ అవుతూ... సూర్య మార్కెట్ ని కుదేలు చేశాయి. ఎన్జీకే, బందోబస్త్ సినిమాల్లో సూర్య క్రేజ్ టాలీవుడ్లో పూర్తిగా పడిపోయింది. అయితే సూర్య మార్కెట్ పడిపోవడంతో.. టాలీవుడ్ లో అంతో ఇంతో క్రేజ్ ఉన్న కార్తీ సినిమాలపై ఆ ప్రభావం పడింది ఖాకి హిట్, చినబాబు యావరేజ్, దేవ్ ప్లాప్ అయినా.. కార్తీకి తెలుగులో మంచి క్రేజే ఉంది. కానీ అన్న సూర్య ప్లాప్స్ వలన ఇప్పుడు కార్తీ ఖైదీ సినిమా టాలీవుడ్ లో సగానికి సగం రేటుకి పడిపోయింది.
ప్రస్తుతం డబ్బింగ్ సినిమాలు ప్లాప్స్ అవడంతో... కార్తీ ఖైదీకి తెలుగులో మార్కెట్ పెరగలేదు... సరికదా అసలా సినిమాని మూడున్నర కోట్లకి అమ్మడమే హాట్ టాపిక్ అనుకుంటే.. ఆ మూడున్నర కోట్లు కూడా అడ్వాన్స్ పద్దతిలో చెల్లించడమే కాస్త వింతైన విషయం. ఇక అడ్వాన్స్ ఇస్తారు, మూడున్నరకోట్లు సినిమా ద్వారా వసూలైతేనే... మిగతావి నిర్మాతలకు ఇస్తారు. మరి మంచి మార్కెట్ క్రేజ్ ఉన్న కార్తీకి ఇలా మూడున్నర కోట్లు మాత్రమే రావడం మాత్రం పాపం అనిపిస్తుంది. అన్న సినిమాల ప్లాప్స్ కి తమ్ముడు బలవడం అంటే ఇదే మరి.