Advertisementt

‘అసురన్’ తెలుగు రీమేక్‌ హీరో ఫిక్స్!

Fri 25th Oct 2019 07:31 AM
venkatesh,daggubati,hero,asuran,telugu,remake  ‘అసురన్’ తెలుగు రీమేక్‌ హీరో ఫిక్స్!
Hero confirmed for Asuran Telugu Remake ‘అసురన్’ తెలుగు రీమేక్‌ హీరో ఫిక్స్!
Advertisement
Ads by CJ

వెంకటేష్ దగ్గుబాటి హీరోగా ‘అసురన్’ తెలుగు రీమేక్..

ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన అసురన్ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఈ యాక్షన్ డ్రామాను వెట్రిమారన్ తెరకెక్కించారు. దసరా సెలవుల్లో తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించింది అసురన్ చిత్రం. ఈ మధ్య కాలంలో కేవలం కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్న హీరో వెంకటేష్.. అసురన్ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నారు. 

ప్రస్తుతం ఈ దగ్గుబాటి హీరో వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అసురన్ రీమేక్‌లో నటించనున్నారు. తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.

Hero confirmed for Asuran Telugu Remake:

Venkatesh Daggubati in Asuran Telugu Remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ