Advertisementt

మెగాస్టార్‌ను కలిసిన ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌

Fri 25th Oct 2019 07:29 AM
film critics,association,meets,mega star,chiranjeevi  మెగాస్టార్‌ను కలిసిన ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌
Film Critics Association Meets Mega Star Chiranjeevi మెగాస్టార్‌ను కలిసిన ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ను కలిసిన ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం త్వరలో ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు 

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం విజయవంతమైన సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఈరోజు (గురువారంనాడు) ఆయన నివాసంలో కలవడం జరిగింది. మెగాస్టార్‌ చిరంజీవి గారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చాలను ఫిలింక్రిటిక్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ 50 సంవత్సరాలు పూర్తయిన విషయాన్ని ఆయనకు తెలియజేస్తూ గోల్డెన్‌ జూబ్లీ వేడుకను వైభవంగా నిర్వహించబోతున్నామన్న విషయాన్ని మెగాస్టార్‌కు తెలియజేయడం జరిగింది. ఈ వేడుకకు ఆయనను ఆహ్వానించడం జరిగింది. వెంటనే ఆయన తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది.

మెగాస్టార్‌ను కలిసిన వారిలో ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కొండేటి సురేష్‌గారు, కార్యదర్శి ఇ. జనార్దన్‌రెడ్డి గారు, గోల్డెన్‌ జూబ్లీ వేడుక ఛైర్మన్‌ బి.ఎ.రాజుగారు, సీనియర్‌ జర్నలిస్టు ప్రభుగారు, అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు డి.జె.భవాని, సజ్జావాసు, కోశాధికారి భూషణ్‌, జాయింట్‌ సెక్రటరీలు పర్వతనేని రాంబాబు, మట్టయ్య (మడూరి మధు), కార్యవర్గ సభ్యులు సాయిరమేష్‌, ముత్యాల సత్యనారాయణ, మురళి (శక్తిమాన్‌), చిన్నమూల రమేష్‌, జిల్లా సురేష్‌ తదితరులు వున్నారు.

Film Critics Association Meets Mega Star Chiranjeevi:

FCA Ready to Celebrates Golden Jubilee

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ