Advertisementt

నాని ఆ హీరోతో ‘హిట్’ ఇవ్వబోతున్నాడు..!

Thu 24th Oct 2019 10:50 PM
nani,awe,hit,viswak sen,second production film,nani banner  నాని ఆ హీరోతో ‘హిట్’ ఇవ్వబోతున్నాడు..!
Nani Predicts Hit For His Second నాని ఆ హీరోతో ‘హిట్’ ఇవ్వబోతున్నాడు..!
Advertisement
Ads by CJ

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్‌పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై విశ్వ‌క్ సేన్ హీరోగా ‘హిట్’ చిత్రం ప్రారంభం

హీరోగా ప‌లు వైవిధ్య‌మైన చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించి త‌నకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు నేచుర‌ల్ స్టార్ నాని. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేసే క్ర‌మంలో భాగంగా వాల్‌పోస్ట‌ర్ సినిమా అనే బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి తొలి ప్ర‌య‌త్నంలోనే ‘అ!’ వంటి డిఫ‌రెంట్ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించి నిర్మాత‌గా స‌క్సెస్‌ను సాధించారు. గురువారంనాడు హైద‌రాబాద్‌లో వాల్‌పోస్ట‌ర్ సినిమా ప్రొడ‌క్ష‌న్ నెం.2గా కొత్త చిత్రం ‘హిట్‌’ పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. రీసెంట్‌గా విడుద‌లైన ‘ఫ‌ల‌క్‌నుమాదాస్‌’తో హీరోగా ప్రూవ్ చేసుకున్నవిశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తున్నారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

ఈ చిత్రం ద్వారా శైలేష్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. నాని స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌శాంతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

Nani Predicts Hit For His Second:

Nani Second Production Film Started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ