Advertisementt

షాకింగ్: టాలీవుడ్ స్టార్ హీరో డాటర్ విడాకులు!?

Wed 23rd Oct 2019 05:14 PM
divorce,manchu manoj,tollywood star hero daughter,businessmen  షాకింగ్: టాలీవుడ్ స్టార్ హీరో డాటర్ విడాకులు!?
Shocking : Divorce to Daughter of Tollywood star Hero! షాకింగ్: టాలీవుడ్ స్టార్ హీరో డాటర్ విడాకులు!?
Advertisement
Ads by CJ

సినీ ఇండస్ట్రీలో బంధాలు నీటిమీద రాతల్లాగే ఉంటాయన్న విషయం విదితమే.. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షర సత్యమే. ఎవరికి ఎవరెలా కనెక్ట్ అవుతారో..? ఎప్పుడు విడిపోతారో..? తెలియని పరిస్థితి. ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా బాలీవుడ్‌లో జరుగుతుంటాయ్ కానీ.. మన సౌత్‌లో మరీ ముఖ్యంగా తెలుగు సినీ ప‌రిశ్రమ‌లో ఈ సంస్కృతి అస్సలు ఉండేది కాదు. కానీ ఈ మధ్య మొదలయ్యాయ్..!

ఇటీవలే ఎవరూ ఊహించని విధంగా ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న హీరో మంచు మనోజ్.. సతీమణి ప్రణతిరెడ్డికి విడాకులు ఇచ్చాడు. అయితే విడాకులు దారితీయడానికి గల కారణాలు చెబుతూ ఎమోషనల్ అవ్వడం చూసి అభిమానులు, సినీ ప్రియులు చాలా బాధపడ్డారు కూడా. ఈ ఘటన మరుమక ముందే మరో ఇదే టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో కుమార్తె విడాకులు తీసుకోబోతున్నట్లు షాకింగ్ విషయం వెలుగుచూసింది.

టాలీవుడ్ స్టార్ హీరో తన కుమార్తెను ఓ బిజినెస్‌మ్యాన్‌కు ఇచ్చి కొన్నేళ్ల క్రితం అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. అంతేకాదు అడిగిన దానికంటే ఎక్కువగానే కట్నం కింద కట్టబెట్టారు కూడా. అయితే భార్య భర్తల మధ్య అస్తమాను మనస్పర్థలు రావడం.. చీటికి మాటికి చిన్న విషయాలకు కూడా గొడవ పడుతుండటం, రోజూ కొట్లాటలేనట. దీంతో  భర్తకు దూరంగా అమ్మగారింట్లోనే ఆమె ఉంటోందట. ఈ క్రమంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తోందట.

అందుకే.. ఇక విడాకులు తీసుకోవడానికి ఈ జంట సిద్ధంగా కాగా.. అమ్మాయి తండ్రి కూడా ఓకే చెప్పారని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే విడాకులు తీసుకుంటారట. మరోవైపు భర్త తరపు వాళ్లు మాత్రం విడాకులు కాకుండా సమస్యను సామరస్యంగా చర్చించుకుంటే పరిష్కారాలు దొరుకుతాయని చెప్పినప్పటికీ.. ఇబ్బంది, ఇష్టం లేకుండా సంసారం చేయడం కష్టంతో కూడుకున్న పనే ఇక మాటల్లేవ్.. చేతలే.. విడాకులు తీసుకోవాల్సిందేనని స్టార్ హీరో కుమార్తె గట్టిగా పట్టుబట్టిందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది.

Shocking : Divorce to Daughter of Tollywood star Hero!:

Shocking : Divorce to Daughter of Tollywood star Hero!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ