Advertisementt

RRR : కీలక పాత్రలో స్వీటీ అనుష్క..!!

Wed 23rd Oct 2019 04:46 PM
rajamouli,rrr movie,sweety anushka shetty,ramcharan,jr ntr  RRR : కీలక పాత్రలో స్వీటీ అనుష్క..!!
Sweety Anushka shetty in RRR Movie! RRR : కీలక పాత్రలో స్వీటీ అనుష్క..!!
Advertisement
Ads by CJ

బాహుబలి సినిమాలో అవకాశమిచ్చి తనకంటూ జాతీయస్థాయిలో ఓ గుర్తింపునిచ్చిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న RRR చిత్రంలో నటించేందుకు స్వీటీ అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వచ్చిందంటే దాదాపు ఎవరూ వదులుకోరు. అయితే ఇప్పటికే తన సినిమాలో కీలక పాత్ర ఇచ్చి అనుష్క రేంజ్‌ ఏంటో తెలుసుకున్న జక్కన్న పిలిచి మరీ అవకాశం ఇచ్చారట. 

RRRలో అనుష్క రోల్ చిన్నది అయినప్పటికీ.. చాలా కీలకమైనదట. సగం కథ మొత్తం ఈమె పాత్ర చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది. అందుకే అనుష్క కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ భారీ బడ్జెట్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ రోల్‌లో ఎవరైతే సూట్ అవుతారా..? అని గత కొన్ని రోజులుగా వేటసాగించిన జక్కన్నకు అనుష్క అయితే సరిగ్గా సెట్ అవుతుందని భావించి తీసుకున్నట్లు సమాచారం.

కాగా.. అనుష్క గురించి చెప్పాలంటే అరుంధతికి ముందు.. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. అరుంధతి, భాగమతి, తాజాగా ‘సైరా’ సినిమాలో నటించిన ఈ యోగా బ్యూటీకి అవకాశాలకు మాత్రం కొదువలేదు. కనీసం చిన్న పాత్రలో అయినా నటించే ఛాన్స్‌లు మాత్రం వస్తూనే ఉన్నాయ్. మరి జక్కన్న RRR చిత్రంలో ఈ ముద్దు కమ్ బొద్దుగుమ్మ పాత్ర ఎలా ఉండబోతోందో..? అసలు ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

Sweety Anushka shetty in RRR Movie!:

Sweety Anushka shetty in RRR Movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ